బాలీవుడ్ ప్రముఖ నటుడు షారూఖ్ ఖాన్ ( Shah Rukh Khan )గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.షారూఖ్ ఖాన్ ఖాతాలో ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్లు ఉన్నాయి.
జవాన్ సినిమాతో షారూఖ్ ఖాన్ ఖాతాలో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ చేరింది.షారూఖ్ ఖాన్ ముంబైలోని పాలీ హిల్( Pally Hill, Mumbai ) ప్రాంతంలో 2 లగ్జరీ డ్యూప్లెక్స్ అపార్టుమెంట్లను అద్దెకు తీసుకున్నారు.
వీటి అద్దె ఏడాదికి 2 కోట్ల 90 లక్షల రూపాయలు కావడం గమనార్హం.
నెలకు 24 లక్షల రూపాయల చొప్పున అద్దె చెల్లించే విధంగా ఈ ఒప్పందం జరిగింది.
ఈ అపార్టుమెంట్లు రకుల్ ప్రీత్ సింగ్ ( Rakul Preet Singh )భర్త జాకీ భగ్నానీకి చెందినవని తెలుస్తోంది.షారూఖ్ ఖాన్ కు ఇప్పటికే ముంబైలో ఖరీదైన లగ్జరీ అపార్టుమెంట్లు ఉన్నాయి.
అయితే అదనపు అవసరాల నిమిత్తం వీటిని కొనుగోలు చేసినట్టు సమాచారం అందుతోంది.

ఆదాయపు పన్ను లెక్కలు, వ్యవహారాలు సైతం ఈ డీల్ కు ఒక విధంగా కారణమనే కామెంట్లు వినిపిస్తున్నాయి.షారూఖ్ ఖాన్ లగ్జరీ అపార్టుమెంట్ల కోసం ఈ స్థాయిలో ఖర్చు చేయడంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.షారూఖ్ ఖాన్ తర్వాత సినిమాలతో భారీ విజయాలను అందుకోవాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు.
షారుఖ్ ఖాన్ రెమ్యునరేషన్ ఒకింత భారీ స్థాయిలో ఉంది.

షారుఖ్ ఖాన్ సౌత్ డైరెక్టర్ల డైరెక్షన్ లో నటించడానికి ఆసక్తి చూపిస్తారు.షారుఖ్ ఖాన్ కెరీర్ ప్లానింగ్ ఏ విధంగా ఉండనుందో చూడాల్సి ఉంది.బాలీవుడ్ ఇండస్ట్రీలో షారుఖ్ ఖాన్ కు మరికొన్ని సంవత్సరాల పాటు తిరుగులేదని కామెంట్లు వినిపిస్తున్నాయి.
షారుఖ్ ఖాన్ కు ఊహించని స్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్ పెరుగుతోంది.బాలీవుడ్ ఇండస్ట్రీ సక్సెస్ రేట్ గత కొన్నేళ్లలో ఊహించని స్థాయిలో తగ్గిన సంగతి తెలిసిందే.
ఛావా సినిమా సక్సెస్ బాలీవుడ్ ఇండస్ట్రీకి కొంతమేర ఊరటనిచ్చిందని చెప్పవచ్చు.