టాలీవుడ్ ప్రముఖ హీరోలలో ఒకరైన విశ్వక్ సేన్ ( Vishwak Sen )గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.విశ్వక్ సేన్ నటించి ఈ నెల 14వ తేదీన థియేటర్లలో విడుదలైన లైలా మూవీ( Laila Movie ) ఫ్లాప్ రిజల్ట్ ను అందుకున్న సంగతి తెలిసిందే.
ఈ సినిమాలోని డైలాగ్స్ విషయంలో సైతం కొన్ని విమర్శలు వినిపించాయి.అయితే విశ్వక్ సేన్ ట్విట్టర్ వేదికగా చేసిన పోస్ట్ లో అభిమానులకు క్షమాపణలు చెప్పారు.
ఈ మధ్య కాలంలో నా సినిమాలు కోరుకున్న స్థాయికి చేరుకోలేదని నా చివరి సినిమాకు వచ్చిన నిర్మాణాత్మక విమర్శలను అంగీకరిస్తున్నానని విశ్వక్ సేన్ చెప్పుకొచ్చారు.నన్ను నమ్మి నా ప్రయాణానికి మద్దతుగా నిలిచిన ప్రతి ఒక్కరికీ, నా ఫ్యాన్స్ కు, నాపై ఆశీర్వాదంగా నిలిచిన వారికి హృదయపూర్వక క్షమాపణలు అని కామెంట్లు చేశారు.

నా ప్రాధాన్యం ఎప్పుడూ కొత్తదనం తీసుకురావడమే అని ఆయన చెప్పుకొచ్చారు.కానీ ఆ ప్రయత్నంలో మీ అభిప్రాయాలను నేను గౌరవిస్తున్నానని విశ్వక్ సేన్ కామెంట్లు చేశారు.ఇకపై నా సినిమాలలో అసభ్యత ఉండదని హామీ ఇచ్చారు.నేను చెడు సినిమా తీస్తే నన్ను విమర్శించే హక్కు అభిమానులకు పూర్తిగా ఉందని నా ప్రయాణంలో ఎవ్వరూ లేని సమయంలో నన్ను ప్రేమతో ముందుకు నడిపించింది మీరేనని విశ్వక్ సేన్ తెలిపారు.

ఇకపై నా సినిమాలలో ప్రతి సీన్ మనసుకు హత్తుకునేలా ఉండేలా చూసుకుంటానని విశ్వక్ సేన్ పేర్కొన్నారు.త్వరలో మరో బలమైన కథతో ముందుకు వస్తానని నా మంచి, చెడు కాలాల్లో నన్ను నమ్మి నిలబెట్టుకున్న ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు అని విశ్వక్ సేన్ చెప్పుకొచ్చారు.విశ్వక్ సేన్ వెల్లడించిన విషయాలు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నాయి.విశ్వక్ సేన్ రెమ్యునరేషన్ పరిమితంగానే ఉందని తెలుస్తోంది.