శ్రీ మహా విష్ణువు దశావతారాలు ఏమిటో తెలుసా?

యుగ యుగాల్లో లోకాన్ని పాలించేందుకు, ధర్మ సంస్థాపన కోసం శ్రీ మహా విష్ణువు దశావతారాలు ఎత్తాడు.విష్ణు సహస్ర నామ స్తోత్రంలో విష్ణువే పరమాత్ముడని, పరమేశ్వరుడని, విశ్వ రూపుడని, కాలా తీతుడని సృష్టి స్థితి లయాధి పతని అలాగే దేవ దేవుడని ఉంది.

 Do You Know What Re The Dashavatharas Of Sri Maha Vishnuvu, Dashavatharas , Mah-TeluguStop.com

మొత్తం శ్రీ మహా విష్ణువు పది అవతారాలు గరించి మనం ఇప్పుడు తెలుసుకుందాం.

అందులో మొదటిది మత్స్యావతారం.

మత్స్యం అంటే చేప.ముఖ్యంగా శ్రీ మహా విష‌్ణువు రెండు పనులు చేసినట్లు పురాణ గాథల్లో వివరించ బడింది.ప్రళయ కాలంలో జీవ రాసులను జల నిధిని దాటించడం.  వేదాలను కాపాడడం.రెండవది కూర్మావతారం.కూర్మం అనగా తాబేలు.

క్షీర సాగర మథన సమయంలో కవ్వం పాల సముద్రంలో మునిగిపోకుండా ఉండేందుకు ఈ అవతారం ఎత్తాడు.మూడోది వరాహావతారం.

హిరణ్యాక్షుడిని చంపేందుకు, భూమిని ఉద్ధరించి, వేదాలు కాపాడిన అవతారమే వరాహావతారం.నాలుగవది నరసింహావతారం.

భక్తుని మాటను నిజం చేస్తూ.సగం మనిషి, సగం మృగం ఆకారంలో ఉడి హిరణ్యక శిపుడిని చంపేందుకు మహా విష్ణువు ఈ అవతారం ఎత్తాడు.

ఐదోది వామనావతారం.బలి చక్రవర్తి దగ్గర నుంచి మూడు అడుగులు నేల అడిగి త్రివిక్రముడై మొత్తం జగత్తును రెండు అడుగులతో సొంతం చేసుకొని బలి చక్రవర్తిని పాతాళానికి తొక్కుతాడు.ఆరోది పరశురామ అవతారం.అధికార పల మందాధులైన క్షత్రియులను శిక్షించేందుకు మహా విష్ణువు పరుశురామ అవతారం ఎత్తాడు.ఏడవది రామావతారం.లాంకాధిపతి అయిన రావణాసురుడిని సంహరించి సీతను పొందేందుకు ఈ అవతారం ఎత్తాడు.

ఎనిమిదవది కృష్ణావతారం.గీతోపదేశం ద్వారా అర్జునుడికి త్య దర్శనం చేసి, కురుక్షేత్ర మహా సంగ్రామాన్ని ముందుండి నడిపించేందుకు ఈ అవతారం ఎత్తాడు.

తొమ్మిదవది బల రామావతారం.పదవది కల్కి అవతారం.

Do You Know What Re The Dashavatharas Of Sri Maha Vishnuvu, Dashavatharas , Maha Vishnuvu, Devotional , Kurmavataram, Narasimhavataram - Telugu Dashavatharalu, Devotional, Kurmavataram, Maha Vishnuvu, Simhavataram, Sri Mhavishnuvu, Vamanavatharam

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube