2023 నూతన సంవత్సరంలో అడుగుపెట్టడానికి దాదాపు చాలా దగ్గరలో ఉన్నాము.చరిత్ర పుటల్లో నిలిచిపోవడానికి కేవలం కొన్ని రోజులు మాత్రమే ఉంది.
అయితే 2023 కోసం చాలామంది ప్రజలు ఎంతో ఉత్సాహంగా ఎదురుచూస్తున్నారు.అయితే రానున్న సంవత్సరం ఎలా ఉంటుందన్న ప్రశ్న అందరిలో ఉంది.
గత రెండు సంవత్సరాలుగా ప్రపంచంలో చోటు చేసుకున్న ఓడి దుడుకుల నుంచి ఉపశమనం లభిస్తుందా లేక ప్రపంచం కొత్త రకాల సంక్షోవలను ఎదుర్కొనే అవకాశం ఉందా అని అందరు ఆలోచిస్తున్నారు.జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ప్రపంచంలో భారీ మార్పులు వచ్చినప్పుడల్లా లేదా కొత్త సంక్షోభం ఏర్పడినప్పుడు శని, కుజుడు, రాహు, కేతువు వంటి గ్రహాల ప్రభావం అటువంటి మార్పులలో కచ్చితంగా ఈ గ్రహాలు ప్రత్యేక పాత్ర పోషిస్తాయని చాలామంది ప్రజలు నమ్ముతారు.
ఇంకా చెప్పాలంటే 2023 ఏడాదిలో శని గ్రహం కుంభ రాశిలో సంచరిస్తే మహా వినాశనానికి అవకాశం ఉందని పలువురు జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు.శని 2022 ఏప్రిల్ 29న కుంభ రాశిలోకి ప్రవేశించే అవకాశం ఉంది.
ఆ తర్వాత 2022 జూలై 12 వ తేదీన మకర రాశిలోకి తీరుగవనం మొదలుపెట్టే అవకాశం ఉంది.అప్పటినుంచి రష్యా, ఉక్రెయిన్ మధ్య యుద్ధం మొదలైంది.ఈ రెండు దేశాల మధ్య జరుగుతున్న యుద్ధం మొదలై పూర్తిగా సంవత్సరం కాలమైంది.అటువంటి పరిస్థితులలో శని మళ్ళీ జనవరి 17వ తేదీ 2023 న కుంభ రాశిలోకి ప్రవేశించే అవకాశం ఉంది.
ఇది మార్చి 29 2025 వరకు ఈ రాశి లోనే ఉంటుంది.

ఇలాంటి పరిస్థితులలో మూడవ ప్రపంచా యుద్ధానికి దారి తీసే అవకాశం ఉందేమో అని జ్యోతిష్య నిపుణులు ప్రపంచాన్ని హెచ్చరిస్తున్నారు.భవిష్యత్తులో పెను విధ్వంసం సృష్టించనున్నదని జ్యోతిష్య శాస్త్ర గ్రహణాలు అంచనా వేస్తున్నాయి.2025 మార్చి 29 నుండి ఫిబ్రవరి 23 2028 వరకు శని మీన రాశిలోకి నిదానంగా సంచరించే అవకాశం ఉంది.దీనివల్ల ప్రపంచంలో చాలా కల్లోలం ఏర్పడే అవకాశం ఉందని హెచ్చరికలు జారీ చేస్తున్నారు.శని 2028 ఫిబ్రవరి 23వ తేదీ నుంచి 2030 ఏప్రిల్ 17వ తేదీ వరకు మేషరాశిలో ఉంటాడు.2020 నుంచి 2030 వరకు శని పీడ ఉండే అవకాశం ఉందని చెబుతున్నారు.