అందరితో కలిసి ప్రశాంతంగా ఉండాలని మహిళలు వరలక్ష్మీ వ్రతం ( Varalakshmi Vratam )చేస్తూ ఉంటారు.ఎవరి స్థాయికి తగిన రీతిలో వారు ఈ వ్రతాన్ని ఆచరిస్తారు.
ముఖ్యంగా చెప్పాలంటే ఈ వ్రతాల వల్ల అందరితో ఆనందంగా ఉండడం అనేది వీటి ముఖ్య ఉద్దేశం. శ్రావణమాసం( Sravanamasam )లో వచ్చే పూర్ణిమ ముందు శుక్రవారం రోజు ఈ వరలక్ష్మీ వ్రతం ఆచరిస్తారు.
ఈ వరలక్ష్మి వ్రతం ఆచరించే మహిళలు ఎంతో ఆనందోత్సవంతో ఉంటారు.వరలక్ష్మి పూజకు కావాల్సిన అన్ని ఏర్పాట్లు చేసుకుంటారు.
వరలక్ష్మీదేవి చారుమతి అనే మహిళకి కలలు కనిపించి ఈ వ్రతం చేసుకోమని, ఈ వ్రతం విధి విధానం చెప్పింది.

ముఖ్యంగా చెప్పాలంటే ఈ వ్రతం ఆచరిస్తున్నప్పుడు విగ్రహానికి పూజ చేస్తున్నాము అనే భావన కాకుండా అమ్మవారే తమ ఇంటికి వచ్చి అలా కూర్చొని షోడషోపచారాలతో పూజ చేయించుకుంటుంది అని భావించాలి.ఈ పూజలు చేసే మహిళలందరూ తమకు తాము వరలక్ష్మి గా భావించుకోవాలి.భక్తి శ్రద్ధ భక్తులతో పూజ చేయాలి.
ఈ సమయంలో అన్నీ రకాల సుగంధ ద్రవ్యాలు, అగరబత్తులు హారతి కర్పూరం ఎన్ని రకాలు ఉంటాయో అన్ని రకాలను ఎక్కువగా వెలిగిస్తారు.ధూపం వేయడం వల్ల ఇల్లు ఒక దేవాలయం గా మారుతుంది.
అప్పుడు వచ్చే ఆలోచనలు అన్ని అనుకూలంగా ఉంటాయి.వ్యతిరేకమైన ఆలోచనల వైపు దృష్టి వెళ్ళదు.
ఇంకా చెప్పాలంటే వరలక్ష్మి వ్రతం చేసేటప్పుడు రకరకాల పండ్లు, పూలతో అమ్మవారిని అలంకరించాలి.అన్ని రకాల అలంకరణలకు శుక్రుడు కారకం వహిస్తాడు.
ఆనందంగా ఉన్నప్పుడు సెలిటోనిన్ హార్మోన్ ఒకటి శరీరంలో విడుదలవుతుంది.ఈ హార్మోన్ వ్యక్తిని ఎక్కువ కాలం సంతోషంగా ఉంచడానికి ఉపయోగపడుతుంది.
సంతోషంగా ఉన్నప్పుడు స్పందనలు బాగుంటాయి.సంతోషంగా లేనప్పుడు ఏదో ఆలోచిస్తూ ఉంటే అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది.

ముఖ్యంగా మహిళలకు సంబంధించిన దేవత లక్ష్మీదేవి( Goddess Lakshmi ) కాబట్టి ఈ వ్రతాన్ని ఆచరిస్తారు.శుక్రుడు ప్రేమకు కారకుడు.వివాహాలకు కారకుడు.శరీరంలో ఒక రకమైన ఆకర్షణ ఇచ్చే గ్రహం శుక్రుడు.జాతకంలో శుక్రగ్రహం లోపంగా ఉంటే ఆకర్షణ శక్తి తక్కువగా ఉంటుంది.ఆ ఆకర్షణను పెంచుకోవడానికి ఈ పూజ ఎంతో అవసరం.
సరైన సమయంలో వివాహం కావడానికి కూడా శుక్రుడే కారకుడు అని పండితులు చెబుతున్నారు.అన్ని రకాల ఆనందాలు, అష్టైశ్వర్యాలు పొందాలంటే లక్ష్మీ పూజ తప్పనిసరిగా ప్రతి శుక్రవారం చేసుకోవడం ఎంతో మంచిది అని పండితులు చెబుతున్నారు.
LATEST NEWS - TELUGU







