ఒక వ్యక్తి తన జీవితకాలంలో శని( Shani ) ప్రభావానికి లోనై అనేక సమస్యలను ఎదుర్కొంటూ ఉంటాడు.మకర, కుంభరాశులకు అధిపతి శని.
అయితే శని శ్రమ కారకుడు అని కష్టపడితే ప్రభావం తక్కువగా చూపిస్తాడని అంటారు.ముఖ్యంగా చెప్పాలంటే చీమలకు పంచదార వేసిన, ఎక్కువగా నడిచిన శని బాధల నుంచి కొంతవరకు విముక్తి లభిస్తుందని పండితులు చెబుతున్నారు.
ఇంతకీ చీమలకు శని దేవుడికి ఉన్న సంబంధం ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.గోచార రీత్యా శని మేషం నుంచి మీనరాశి( Aries to Pisces ) వరకు సంచరిస్తాడు.
12 రాశులలో సంచారం పూర్తి చేసుకోవడానికి మొత్తం 30 సంవత్సరాల సమయం పడుతుంది.జాతకునికి గోచార రీత్యా తన జన్మరాశి నుంచి 12, 1,2 స్థానాల్లో సంచరించే కాలాన్ని ఏల్నాటి శని అని అంటారు.
ఈ మూడు రాశులలో మొత్తం ఏడున్నర సంవత్సరాలు సంచరించడం వల్ల దీనిని ఏల్నాటి శని అని పిలుస్తారు.
జన్మరాశి నుంచి పదవ స్థానంలో శని సంచరిస్తున్నప్పుడు కంటక శని అని పిలుస్తారు.దీనివల్ల కోర్టు కేసులు, సాంఘిక, రాజకీయంగా అపవాదులు, అధికారులతో, ఉద్యోగులకు అకస్మాక బదిలీలు వంటి ఫలితాలు ఉంటాయి.అయితే జాతక చక్రంలో శని మంచి స్థితిలో ఉన్నప్పుడు గోచారంలో గురుబలం ఉన్నప్పుడు ఏల్నాటి శని అంతగా బాధించడు.
ఈ దోషాలు ఉన్న వారు శనికి తైలాభిషేకాలు, జపాదులు చేయించుకుంటే కొంత ఉపశమనం కలుగుతుంది.శని శ్రమ కారకుడు,వాయు కారకుడు కాబట్టి రోజు వాకింగ్ చేయడం, యోగ చేయడం, శ్రమ కారక జీవులైన చీమలకు పంచదార కానీ, తేనె కానీ వేయడం వల్ల శని బాధల నుంచి విముక్తి పొందవచ్చు.
చీమలు ఐక్యమత్యానికి నిదర్శనం.ఒకే పుట్టలో కలిసి ఉండటమే కాకుండా వాటి పని అవి సక్రమంగా చేసుకోవడంలో ఎంతో క్రమశిక్షణ పాటిస్తాయి.అందుకే శ్రమ జీవనానికి నిదర్శనమైన చీమలకు ఆహారం వేస్తే శని బాధల నుంచి కొంతవరకు ఉపశమనం లభిస్తుందని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు.