అధిక ఒత్తిడి, ఆహారపు అలవాట్లు, నిద్ర లేమి, కంప్యూటర్ల ముందు గంటలు తరబడి వర్క్ చేయడం, డీహైడ్రేషన్ ఇలా రకరకాల కారణాల వల్ల కళ్ల చుట్టూ డార్క్ సర్కిల్స్ ఏర్పడతాయి.ఇవి చూసేందుకు అసహ్యంగా ఉండటమే కాదు.
అందాన్ని కూడా తీవ్రంగా దెబ్బ తీస్తాయి.అందుకే ఈ డార్క్ సర్కిల్స్‌ను నివారించుకునేందుకు రకరకాల ప్రయ్నత్నాలు చేస్తుంటారు.
అయితే డార్క్ సర్కిల్స్‌కు చెక్ పెట్టడంలో డార్క్ చాక్లెట్ అద్భుతంగా సహాయపడుతుంది.మరి డార్క్ చాక్లెట్‌ను ఎలా యూజ్ చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.
ముందుగా డార్క్ చాక్లెట్ తీసుకుని కరిగించాలి.ఇప్పుడు అందులో కొద్దిగా పెరస పిండి మరియు రెండు, మూడు చుక్కల బాదం ఆయిల్ వేసి బాగా మిక్స్ చేసుకోవాలి.
ఇప్పుడు ఈ మిశ్రమాన్ని కళ్ల చుట్టూ అప్లై చేసి.ఇరవై నిమిషాల పాటు డ్రై అవ్వనివ్వాలి.అనంతరం చల్లటి నీటితో శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి.ఇలా ప్రతి రోజు చేస్తే క్రమంగా డార్క్ సర్కిల్స్ దూరం అవుతాయి.

అలాగే డార్క్ చాక్లెట్‌ను వేడి చేసి కరిగించుకోవాలి.ఇప్పుడు ఇందులో కొద్దిగా స్వచ్ఛమైన తేనె వేసి కలుపుకోవాలి.ఇప్పుడు ఈ మిశ్రమాన్ని డార్క్ సర్కిల్స్ పై పూసి.పావు గంట పాటు వదిలేయాలి.ఆ తర్వాత గోరు వెచ్చని నీటితో వాష్ చేసుకోవాలి.ఇలా రెగ్యులర్‌గా చేసినా కళ్ల చుట్టూ ఏర్పడిన నల్లటి వలయాలు మటు మాయం అవుతాయి.
ఒక బౌల్ తీసుకుని అందులో కరిగిన డార్క్ చాక్లెట్ మరియు రెండు చుక్కల లావెండర్ నూనె వేసుకుని మిక్స్ చేసుకోవాలి.ఇప్పుడు దీనిని కళ్ల చుట్టూ వేళ్లతో మెల్ల మెల్లగా అప్లై చేసి.
పది నిమిషాల తర్వాత చల్లటి నీటితో శుభ్రంగా వాష్ చేసుకోవాలి.ఇలా ప్రతి రోజు చేసినా కూడా మంచి ఫలితం ఉంటుంది.