మన పూర్వీకుల కాలం నుండి పసుపును వంటకాల్లో వాడుతూ ఉన్నాం.వంటకాలకు రుచి రావటమే కాకుండా ఎన్నో ఆరోగ్య సమస్యలను తగ్గిస్తుంది.పసుపులో యాంటీ వైరల్, యాంటీ బాక్టీరియల్, యాంటీ ఫంగల్ లక్షణాలు ఉండుట వలన ఇన్‌ఫెక్షన్స్ రాకుండా కాపాడుతుంది.
1.ఒక గ్లాస్ గోరువెచ్చని నీటిలో చిటికెడు పసుపు,కొంచెం మిరియాల పొడి కలుపుకొని రాత్రి పడుకొనే ముందు త్రాగితే జలుబు,దగ్గు తగ్గుతాయి.
2.కొన్ని జామ ఆకులలో చిటికెడు పసుపు వేసి పేస్ట్ చేసి ముఖానికి రాసి 10 నిముషాలు అయ్యాక చల్లని నీటితో శుభ్రం చేసుకోవాలి.ఈ విధంగా చేయటం వలన మొటిమలు కారణంగా వచ్చే మచ్చలు పోతాయి.
3.ప్రతి రోజు వంటలలో పసుపును వాడితే చెడు కొలస్ట్రాల్ పోయి మంచి కొలస్ట్రాల్ పెరుగుతుంది.అలాగే బిపి కూడా కంట్రోల్ లో ఉంటుంది.
4.వేపాకు,పసుపు రెండింటిని సమ పాలల్లో తీసుకోని పేస్ట్ చేయాలి.ఈ పేస్ట్ ని స్నానము చేయటానికి ముందు శరీరానికి పట్టించి 10 నిమిషాల తర్వాత స్నానము చేస్తే గజ్జి,తామర వంటి చర్మ సమస్యలు తగ్గుతాయి.
5.వేప నూనెను కొంచెం వేడి చేసి దానిలో పసుపు కలిపి కాలిన గాయాల మీద రాస్తే వెంటనే ఉపశమనం కలుగుతుంది.
6.పసుపు,ఉప్పు,నీరు కలిపి దంతాలను శుభ్రం చేసుకుంటే దంతాలు తెల్లగా మారటమే కాకుండా దంత సమస్యలు కూడా దూరం అవుతాయి.
7.పసుపు, గంధం, వేప, తులసి ఆకులను సమాన భాగాలుగా తీసుకోని పేస్ట్ చేసి రాస్తే చికెన్ పాక్స్ (ఆటలమ్మ) తగ్గుతుంది.
8.పసుపు, కొద్దిగా నిమ్మరసం, బియ్యపు పిండిని కలిపి ముఖానికి రాసి 20 నిముషాలు అయ్యాక చల్లని నీటితో శుభ్రం చేసుకుంటే ఎండకు కమిలిన చర్మం పూర్వ స్థితికి వస్తుంది.
9.పచ్చి పసుపు కొమ్మును బాగా నూరి దాన్ని మజ్జగలో కలిపి ప్రతి రోజు తీసుకుంటే దీర్ఘ కాలికంగా ఉన్న చర్మవ్యాధులు తగ్గుతాయి.