తెలంగాణ నూతన సచివాలయం రేపు ప్రారంభం కానుంది.ఈ సందర్భంగా రేపు హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు అమలు కానున్నాయి.
ఈ మేరకు హుస్సేన్ సాగర్ పరిసరాలతో పాటు సైఫాబాద్, నెక్లెస్ రోడ్డు ప్రాంతాల్లోనూ దారి మళ్లింపు ఉంటుందని పోలీసులు తెలిపారు.కాగా ఉదయం 4 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు ఈ ఆంక్షలు అమల్లోకి రానున్నాయి.
అదేవిధంగా తెలుగు తల్లి ప్లై జంక్షన్ మార్గంలో వాహనాల అనుమతిని నిరాకరించనున్నారు.







