నట్స్‌ను ఎక్కువగా తినే వారు వాటి ప్రయోజనాలను ఎంతో కొంత తెలుసుకుంటారు.ఇక వంటింటి చిట్కాలతోనే పలు సమస్యలకు చాలా మంది చెక్ పెడుతుంటారు.
మనకు లభించే పదార్ధాలతోనే ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసుకుంటుంటారు.ఇదే కోవలో జీలకర్ర రకానికి చెందిన కలోంజీ గింజలు ఎన్నో ఔషధ గుణాలు కలిగి ఉంటాయి.
వీటి గురించి తెలుసుకున్న వారెవరైనా ఆశ్చర్యపోవాల్సిందే.ఎన్నో సమస్యలకు పరిష్కారం చూపే ఈ గింజలు తింటే అస్సలు వదిలిపెట్టరు.
పురావస్తు శాస్త్రవేత్తలు ఈజిప్ట్‌లోని టుటన్‌ఖామున్ సమాధిలో ఉంచిన సంపదలో కలోంజీ విత్తనాలను ఇటీవల కనుగొన్నారు.దీంతో కలోంజీ విత్తనాల అద్భుతాలు శతాబ్దాల క్రితం నాటివని స్పష్టమవుతోంది.దీనిని మన వంటింట్లో నల్ల జీలకర్రగా కూడా వ్యవహరిస్తుంటారు.ఎన్నో ఏళ్లుగా దీనిని అద్భుత మూలికగా పరిగణిస్తున్నారు.
ఇది ప్రపంచంలోని వివిధ ప్రాంతాలలో విస్తృతంగా పెరుగుతుంది.భారతదేశంలో కలోంజీ విత్తనాలను సుగంధ ద్రవ్యాలుగా, మూలికా ఔషధంగా వినియోగిస్తున్నారు.
ఆయుర్వేదంలో కలోంజి గింజలు వివిధ వ్యాధులకు పరిష్కారం చూపగలవు.
ఇందులో ఎన్నో పోషకాలు ఉంటాయి.ఫైబర్, ఐరన్, కాల్షియం, పొటాషియం పుష్కలంగా ఉంటాయి.విటమిన్ ఎ, సి, బి, బి12, నియాసిన్, వంటివి కూడా లభిస్తాయి.
వీటితో తయారు చేసే నూనె కూడా ఎన్నో ఔషధ గుణాలు కలిగి ఉంటాయి.నులిపురుగుల నివారణలో, డయాబెటిస్‌ను నియంత్రించడంలో, కంటి సమస్యలను తొలగించడంలో, గుండె సంబంధిత సమస్యలను దూరం చేయడంలో ఇవి అద్భుతంగా పని చేస్తాయి.
బరువు తగ్గాలన్నా, పంటి సమస్యలు దూరం చేసుకోవాలన్నా, చర్మ నిగారింపునకూ ఇవి దోహదపడతాయి.