సోమవారం రోజు మహాశివునికి ఎంతో ఇష్టమైన రోజు.బోలా శంకరుడి అనుగ్రహం కోసం భక్తులు సోమవారం ఓం నమశ్శివాయ అంటూ వివిధ రకాల పూజలను చేస్తూ ఉంటారు.
సోమవారం ఉదయం నిద్ర లేచిన తర్వాత శివుడిని దర్శనం చేసుకుని శివా చాలీసా లేదా శివష్టకాన్ని పాటించడం వల్ల ఎంతో పుణ్యం లభిస్తుంది.పరమశివుని హృదయపూర్వకంగా ఆరాధించడం వల్ల త్వరగా భక్తుల కోరికలు తీరుతాయని చాలామంది భక్తులు నమ్ముతారు.
ఇంకా చెప్పాలంటే వారి కుటుంబ సభ్యులందరూ సుఖ సంతోషాలతో ఉంటారని కూడా నమ్ముతారు.జీవితంలో సమస్యలన్నీ దూరం అవుతాయని గట్టిగా నమ్ముతారు.
సోమవారం శివుని ప్రసన్నం చేసుకోవడానికి ఇలాంటి కొన్ని పరిహారాలను చేయడం ఎంతో మంచిది.
సోమవారం నాడు ఏదైనా శివాలయానికి వెళ్లి శివలింగానికి పచ్చి పాలను నైవేద్యంగా పెట్టడం వల్ల జాతకంలో ఉన్న గ్రహ దోషాలు దూరం అవుతాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతూ ఉంటారు.
ఐదు లేదా ఏడు రోజుల వరకు ఇలా చేయడం వల్ల జాతకంలో ఉన్న గ్రహ దోషాలు అన్నీ దూరమవుతాయని, అంతేకాకుండా భక్తుల కోరికలు నెరవేరుతాయి అని గట్టిగా నమ్ముతారు.ఇంకా చెప్పాలంటే దృష్టి దోషాల నివారణ కోసం ఆదివారం రాత్రి పడుకునే ముందు మీ పక్కన ఒక గ్లాసు పాలను పెట్టుకుని నిద్రపోవడం మంచిది.
దీని తర్వాత మరుసటి రోజు ఉదయం స్నానం చేసి శుభ్రమైన బట్టలు ధరించి గ్లాసులో పాలను ఏదైనా మొక్కకు పోస్తే దృష్టి దోషాలు తొలగిపోతాయని చాలామంది భక్తులు నమ్ముతారు.
అంతేకాకుండా వైవాహిక జీవితంలో ఏమైనా సంస్థలు ఉంటే సోమవారం ఉదయం శివాలయంలో గౌరీ శంకర రుద్రాక్షను సమర్పించడం వల్ల వైవాహిక జీవితంలోని సమస్యలు దూరమయ్యే అవకాశం ఉంది.అంతేకాకుండా జాతకంలో చంద్రుని స్థితిని బలోపేతం చేయడానికి సోమవారం నాడు పరమశివుని పూజించేటప్పుడు ఉత్తర దిశలో కూర్చొని శివ రక్షా స్తోత్రం జపించడం వల్ల జాతకంలో చంద్రుని స్థితి మెరుగుపడి ఆ దోషం కూడా దూరమవుతుంది.
DEVOTIONAL