మనం నిద్రపోతున్నప్పుడు కలలు ఎందుకు వస్తాయో తెలుసా?

సాధారణంగా చెప్పాలంటే నిద్రలో ప్రతి ఒక్కరూ కలలు కంటూ ఉంటారు.కలలు కనడం చెడ్డ విషయం ఏమీ కాదు.

 Do You Know Why Dreams Come When We Sleep , Sleep, Vastu , Vastu Tips, Zodiac-TeluguStop.com

కలలు కనడం ద్వారా మనిషి దానిని సాకారం చేసుకోవడానికి కష్టపడతాడు.అలాగే పెద్దగా కలలు కనేవారు ఎప్పుడూ పెద్దగా ఆలోచిస్తూ ఉంటారు.

కానీ మనం ఎందుకు కలలు కంటున్నామో అని ఎప్పుడూ ఆలోచించి ఉండరు.నిద్రపోతున్నప్పుడు మనం ఊహల ప్రపంచంలోకి ఎందుకు వెళ్తాము.

దీనికి కారణం ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

వాస్తవానికి జీవీ యొక్క మానసిక మరియు శరీరక ఆరోగ్యానికి కలల ప్రాముఖ్యత ముఖ్యమని నిపుణులు చెబుతున్నారు.

మానసిక దృక్కోణం( psychological perspective ) నుంచి కలలు మన మనస్సు యొక్క మూలం మరియు కార్యాచరణను ప్రతిబింబిస్తాయి.మన కలలు మనం ఏమనుకుంటున్నామో లేదా మన దినచర్యలో భాగమైన వాటి ద్వారా ప్రభావితం అవుతాయని వారు చెబుతున్నారు.

కాబట్టి మనం నిరంతరం ప్రశాంతంగా మరియు సానుకూల ఆలోచనలతో ఆలోచిస్తే మన కలలు కూడా మన మనసుకు సానుకూలంగా ఉంటాయి.

Telugu Astrology, Vastu, Vastu Tips, Zodiac-Telugu Raasi Phalalu Astrology Horos

కలల అధ్యయనం ప్రకారం కొంతమంది తమ కలలో కనిపించే విషయాలు మరియు సంఘటనల ఆధారంగా వారి భవిష్యత్తు గురించి ఊహించుకుంటూ ఉంటారు.కలల ద్వారా మనం మన అంతరంగిక బాధలను మరియు ఆందోళనలను ఎదుర్కోవచ్చు.జ్యోతిష శాస్త్రంలో( astrology ) కూడా కలలకు ఎంతో ప్రాధాన్యత ఉంది.

భవిష్యత్తు సంఘటనలను కలల ద్వారా అంచనావేచ్చని కొందరు నమ్ముతారు.కలలు కనడానికి ముఖ్యమైన కారణం మనిషి యొక్క ఆలోచన.

ఒకడు అనుకున్నట్లుగానే కలలు కంటాడు.అయితే కొన్ని కలలు ఆశించిన వాటికి విరుద్ధంగా వస్తాయి.

Telugu Astrology, Vastu, Vastu Tips, Zodiac-Telugu Raasi Phalalu Astrology Horos

కలలు ప్రాథమికంగా ఒక ప్రత్యేక మానసిక స్థితి,ఇందులో వాస్తవికత అనుభూతి చెందుతుంది.కలలు మేలుకునే స్థితిలో అస్సలు రావు.ముఖ్యంగా చెప్పాలంటే ఆహారపు అలవాట్లు మరియు వ్యాధులు కలలలో పెద్ద పాత్ర పోషిస్తాయని కొందరు నిపుణులు చెబుతున్నారు.దీని వెనుక గ్రహాలు మరియు రాశి చక్ర గుర్తులు( Zodiac signs ) కూడా బాధ్యత వహిస్తాయని చెబుతున్నారు.

కానీ ప్రతి కలకి అర్థం ఉండదు.చాలా కలలు కూడా అర్దరహితమైనవిగా ఉంటాయని చెబుతున్నారు.

తమాషా ఏమిటంటే కలలు కనడం మనిషికే కాదు చాలా జంతువులు కూడా నిద్రపోతూనే ఊహల ప్రపంచంలోకి వెళ్లిపోతూ ఉంటాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube