సినీ ఇండస్ట్రీకి చెందిన స్టార్ సెలబ్రెటీల బ్యాక్గ్రౌండ్ ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.ఏదైనా సరే బాగా రిచ్ గా ఉంటుంది.
వారు తీసుకునే ఫుడ్ నుంచి పడుకునే బెడ్ వరకు అన్ని రిచ్ గానే ఉంటాయి.అంతేకాదు వాళ్లు ధరించే వాచ్, దుస్తువులు, తిరిగే కార్లు, ఉండే బంగ్లాలు అన్నీ ఖరీదైనవే.
రోజుకొక వాచ్, రోజుకొక షూ అలా రోజుకొక స్టైల్ తో ట్రెండ్ అవుతూ ఉంటారు.ఒక్కసారి ధరించినవి మళ్లీ ధరించడానికి ఇష్టపడరు.
అటువంటి రిచ్ తనంతో బతుకుతున్నారు కొందరు సెలబ్రిటీలు.ఇక అందులో ఒకరు మహేష్ బాబు.
టాలీవుడ్ ఇండస్ట్రీకి తండ్రి హోదాతో అడుగుపెట్టిన మహేష్ బాబు( Mahesh Babu ) సూపర్ స్టార్ గా ఎదిగి ఇండస్ట్రీలో తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్నాడు.చిన్నవయసులోనే ఇండస్ట్రీకి అడుగుపెట్టిన మహేష్ బాబు చిన్నవయసులోనే నటనతో బాగా మెప్పించాడు.
అలా మెల్లిమెల్లిగా హీరోగా కూడా అడుగుపెట్టాడు.ఎన్నో సక్సెస్ లతో పాటు ప్లాఫ్ లు కూడా అందుకున్నాడు.
అయినా కూడా వెనుకడుగు వేయకుండా ముందుకు దూసుకుపోతూనే ఉన్నాడు.
చాలా వరకు మహేష్ బాబు సినిమాలన్నీ మంచి కంటెంట్ తో ఉంటాయి.కానీ కొంతమంది ప్రేక్షకులకు ఆయన సినిమాలు అర్థం కావు.నిజానికి ఆయన సినిమాలో మంచి మంచి విషయాలు తెలుస్తాయి.
ఇక ఇప్పుడు కూడా వరుస సినిమాలతో బాగా బిజీగా ఉన్నాడు.ఈయన వ్యక్తిగత విషయానికి వస్తే ఈయన మరో హీరోయిన్ నమ్రతను ప్రేమించి పెళ్లి చేసుకోగా వీరికి సితార, గౌతమ్ అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు.
ఇక నమ్రత పెళ్లి తర్వాత సినిమాలకు గుడ్ బై చెప్పి ఇల్లు, ఫ్యామిలీ బాధ్యతలు తనే చూసుకుంటుంది.కూతురు సితార అప్పుడప్పుడు బుల్లితెరపై అడుగుపెట్టి తన పరిచయాన్ని పెంచుకుంది. సోషల్ మీడియా( Social Media )లో కూడా బాగా యాక్టివ్ గా ఉంటుంది.ఇక గౌతమ్ సోషల్ మీడియాలో అంత యాక్టివ్ గా కనిపించడు.
నమ్రత( Namrata Shirodkar ) కూడా సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ ఫ్యామిలీకి సంబంధించిన విషయాలు బాగా పంచుకుంటుంది.
అప్పుడప్పుడు మహేష్ బాబు సినిమా పరంగా బ్రేక్ దొరికితే చాలు ఫ్యామిలీతో ట్రిప్స్ అంటూ సమయాన్ని గడుపుతాడు.ఇక ఈయన సంపాదనపరంగా కూడా బాగానే సంపాదించాడు.అంతేకాకుండా తన ఫౌండేషన్ ద్వారా చాలామందికి సహాయం చేస్తున్నాడు.
తాజాగా తనకు సినిమా పరంగా బ్రేక్ దొరకటంతో ఫ్యామిలీతో కలిసి దుబాయ్ కి వెళ్ళాడు మహేష్ బాబు.
ఈ సందర్భంగా ఎయిర్పోర్టులో ఈ ఫ్యామిలీ స్పెషల్ అట్రాక్షన్ గా కనిపించారు.ముఖ్యంగా మహేష్ బాబు ధరించిన బ్యాగ్ మాత్రం మరింత అట్రాక్ట్ గా కనిపించింది.దీంతో మహేష్ బాబు లుక్ పక్కకు పెట్టి అందరూ ఆ బ్యాగ్ వైపు దృష్టి పెట్టారు.
అయితే ఆ బ్యాగ్ లూయిస్ విటెన్ క్రిస్తఫర్ గా తెలుస్తుంది.నలుపు నీలం డిజైన్ తో అందంగా కనిపించింది.అలాగే ఎల్ వి మోనోగ్రామ్ సిగ్నేచర్ డిజైన్ కూడా ఈ బ్యాక్ పై ఉంది .కాగా ఈ బ్రాండెడ్ బ్యాగ్ ధర రూ.3, 92,656 అని తెలుస్తుంది.దీంతో ఆ చిన్న బ్యాగుకు అంత ధర అని తెలియటంతో జనాలు షాక్ అవుతున్నారు.
ఎంతైనా మహేష్ బాబు మామూలు రిచ్ కాదు బాబోయ్ అంటూ కామెంట్లు పెడుతున్నారు.