తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - ఏప్రిల్ 12 ,సోమవారం, 2021

ఈ రోజు పంచాంగం (Todays Telugu Panchangam):

సూర్యోదయం:ఉదయం 05.54

సూర్యాస్తమయం:సాయంత్రం 06.11

రాహుకాలం: ఉ.

07.30 నుంచి 09.00 వరకు

అమృత ఘడియలు: ఉ.09.00 నుంచి 10.30 వరకు

Advertisement

దుర్ముహూర్తం: మ.12.24 నుంచి 01.12 వరకు

ఈ రోజు రాశి ఫలాలు(Todays Telugu Rasi Phalalu):

మేషం:

ఈరోజు మీకు ఆర్థికంగా ఎక్కువ లాభాలు ఉన్నాయి.కొన్ని విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు.ఇతరులతో ఆలోచించి మాట్లాడాలి.

తొందరపడి మీ వ్యక్తిత్వాన్ని కోల్పోనివ్వకండి.కొన్ని ప్రయాణాలు చేయడం వల్ల కొన్ని పరిచయాలు ఏర్పడతాయి.

పోలింగ్ ఏజెంట్ల నియామకంపై ఈసీ ఆదేశాలు
తల్లికి 15 లక్షల విలువ చేసే జ్యూవెలరీ ఇచ్చిన పల్లవి ప్రశాంత్.. ఈ కొడుకు గ్రేట్ అంటూ?

వృషభం:

Advertisement

ఈరోజు మీకు ఆర్థికంగా ఎక్కువ నష్టాలు ఉన్నాయి.అనవసరమైన వస్తువులు ఎక్కువగా కొంటారు.పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచనలు చేయాలి.

ఇతరులతో మాట్లాడే ముందు మీ వ్యక్తిత్వాన్ని కోల్పోకుండా ఉండాలి.ఉద్యోగస్తులకు అనుకూలంగా ఉంది.

మిథునం:

ఈరోజు మీకు ఆర్థికంగా ఎక్కువ లాభాలు ఉన్నాయి.వాహన కొనుగోలు చేస్తారు.ఇంట్లో పండగ వాతావరణం కనిపిస్తుంది.

కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు.వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో లాభాలు పొందుతారు.

మీరు పనిచేసే చోట జాగ్రత్తగా ఉండాలి.

కర్కాటకం:

వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో తొందర పడకుండా జాగ్రత్తగా ఆలోచించాలి.మీరు పనిచేసే చోట పనులు వాయిదా పడతాయి.

సింహం:

ఈరోజు మీరు ఆర్థిక లాభాలు పొందుతారు.విలువైన వస్తువులు కొంటారు.ఇంట్లో పండగ వాతావరణం కనిపిస్తుంది.

అనుకోకుండా ఇంటికి బంధువులు వస్తారు.దీనివల్ల సంతోషంగా గడుపుతారు.

వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో జాగ్రత్తగా ఉండాలి.

కన్య:

ఈరోజు మీకు ఆర్థికంగా ఎక్కువ లాభాలు ఉన్నాయి.కొన్ని దూర ప్రయాణాలు చేస్తారు.మీ వ్యక్తిత్వాన్ని కోల్పోకుండా జాగ్రత్తగా ఉండాలి.

వ్యాపారస్తులకు పెట్టుబడి విషయంలో అనుకూలంగా ఉంది.మీరు పనిచేసే చోట పనులు త్వరగా పూర్తి అవడం వల్ల సంతోషంగా గడుపుతారు.

తులా:

ఈరోజు మీరు ఆర్థికంగా ఎక్కువ నష్టాలు ఎదుర్కొంటారు.ఇతరులు మీకు ఇచ్చే సొమ్ము తిరిగి ఇవ్వడంలో ఆలస్యం చేస్తారు.కొన్ని ప్రయాణాలు చేయడం వల్ల అనుకూలంగా ఉంటుంది.

తోబుట్టువులతో కలిసి కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చించాలి.

వృశ్చికం:

ఈరోజు మీరు ఆర్థికంగా లాభాలు పొందుతారు.పిల్లల భవిష్యత్తు గురించి కాస్త ఆలోచించాలి.కుటుంబ సభ్యులతో ముఖ్యమైన విషయాల గురించి మాట్లాడాలి.

వ్యాపారస్తులకు పెట్టుబడి విషయంలో అనుకూలం.పనిచేసేచోట జాగ్రత్తగా ఉండాలి.

ధనస్సు:

ఈరోజు మీరు ఆర్థికంగా పొదుపు చేయడం మంచిది.లేదంటే భవిష్యత్తులో ఇబ్బందులు ఎదురవుతాయి.ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి.

పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచన చేయాలి.అనుభవం ఉన్న వ్యక్తులతో కొన్ని విషయాలు పంచుకోవడం వల్ల మనశ్శాంతి కలుగుతుంది.

మకరం:

ఈరోజు మీకు ఆర్థికంగా ఎక్కువ నష్టాలు ఎదురవుతాయి.అనవసరమైన వస్తువులు ఎక్కువగా కొనుగోలు చేస్తారు.ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకోవాలి.

తోబుట్టువులతో వాదనకు దిగకండి.మీ స్నేహితుల ద్వారా సహాయాన్ని అందుకుంటారు.

ఉద్యోగస్తులు జాగ్రత్తగా ఉండాలి.

కుంభం:

ఈరోజు మీరు ఇతరుల నుండి ఆర్థిక సహాయం పొందుతారు.అనవసరమైన ఖర్చులు తక్కువగా కొనాలి.కొన్ని ప్రయాణలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి.

కుటుంబ సభ్యులతో కొన్ని విషయాల గురించి చర్చించాలి.తొందరపడి ఎటువంటి నిర్ణయాలు తీసుకోకూడదు.

మీనం:

ఈ రోజు మీకు ఆర్థికంగా అనుకూలంగా ఉంది.ఇంటికి సంబంధించిన ముఖ్యమైన వస్తువులు కొనుగోలు చేస్తారు.ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకోవాలి.

ఇతరులతో మాట్లాడే ముందు జాగ్రత్తగా ఆలోచించి మాట్లాడాలి.కొన్ని దూర ప్రయాణాలు చేయడం వల్ల అనుకూలంగా ఉంటుంది.

తాజా వార్తలు