వయసు 50 సంవత్సరాలు దాటితే మీ దినచర్యలో బాడీ మసాజ్( Body massage ) ఒక పనిగా పెట్టుకోవాలని ఆరోగ్య నిపుణులు( Health professionals ) చెబుతున్నారు.45 నుంచి 50 సంవత్సరాలు దాటితే శరీరం లోపల ఉండే భాగాల ఎదుగుదల ఆగిపోయి, అరుగుదల మొదలవుతుందని నిపుణులు చెబుతున్నారు.ఫలితంగా పని సామర్థ్యం తగ్గి, మోకాళ్ళ నొప్పులు, కీళ్ల నొప్పులు, కాళ్ళ నొప్పులు, మెడ నొప్పులు, బ్యాక్ పెయిన్ వంటి రుగ్మతలు ఎదురవుతాయి.వీటి నుంచి ఉపశమనం పొందాలంటే రెగ్యులర్ గా బాడీ మసాజ్ ఎంతో అవసరం అని నిపుణులు చెబుతున్నారు.
అందుకోసం మన ఇంట్లోనే రోజు ఉదయం స్నానం చేయడానికి అరగంట ముందు 10 నుంచి 15 నిమిషాల పాటు మనకు మనంగా బాడీ మసాజ్ చేసుకుంటే సరిపోతుంది.బాడీపెయిన్స్ మరి ఎక్కువగా ఉంటే ఫిజియోథెరఫీ వంటివి తప్పవు.
బాడీ మసాజ్ తో ఒళ్ళు నొప్పులు రాకుండా ఉంటాయి.ముందే ఒళ్ళు నొప్పులతో ఇబ్బంది పడుతున్నట్లయితే అవి తగ్గిపోతాయి.
ఇంట్లోనే బాడీ మసాజ్ ఎలా చేసుకోవాలి.దీని వల్ల కలిగే ప్రయోజనాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

ఇంట్లోనే బాడీ మసాజ్ చేసుకోవాలి అనుకునే వారు కొబ్బరి నూనె ( coconut oil )లేదా బాదం నూనెను ఉపయోగించాలి.ఉదయం స్నానానికి వెళ్లే ముందు 15 నిమిషాల పాటు ఆయిల్ తో బాడీ మసాజ్ క్రమం తప్పకుండా చేసుకుంటే చక్కటి ఫలితం ఉంటుంది.ఇందుకోసం కావాలంటే మంచి ఆయుర్వేద పెయిన్ రిలీఫ్ ఆయిల్(Ayurvedic pain relief oil ) ని ఉపయోగించిన మంచి ఫలితాలు ఉంటాయి.మసాజ్ కోసం కావాల్సిన ఆయిల్ తీసుకొని మన చేతి వేళ్ళతోనే రాపిడి ప్రెజర్ తో ఒళ్లంతా పట్టించాలి.
ఒక 15 నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటితో స్నానం చేయాలి.

రోజు క్రమం తప్పకుండా ఇలా చేస్తూ ఉంటే ఒళ్ళు నొప్పులు దూరం అయిపోతాయని నిపుణులు చెబుతున్నారు.బాడీపెయిన్స్ విషయంలో ముందే జాగ్రత్త పడడం ఎంతో అవసరమని నిపుణులు చెబుతున్నారు.లేదంటే ఆ తర్వాత వైద్యం కోసం ఫిజియోథెరపీ మెడిసిన్లు అంటూ ఆసుపత్రుల చుట్టూ తిరగావాల్సి వస్తుంది.
ఇలాంటి జాయింట్ పెయింట్స్, బాడీ పెయింట్స్ మరింత తీవ్రమైతే వేలకు వేలు పెట్టి ఖరీదైన సర్జరీలు, టెన్షన్లు తప్పవని నిపుణులు సూచిస్తున్నారు.