అనంతపురం అర్బన్( Anantapur Urban ) నియోజకవర్గ టీడీపీలో అసంతృప్తి సెగలు రాజుకున్నాయి.నియోజకవర్గ టికెట్ ను ప్రభాకర్ చౌదరి( Prabhakar Chowdary )కి ఇవ్వకపోవడంపై కార్యకర్తలు తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు.
ఈ క్రమంలోనే టీడీపీ కార్యాలయంపై దాడికి పాల్పడ్డారు.కార్యాలయం అద్దాలు, కంప్యూటర్లను ధ్వంసం చేశారు.
అదేవిధంగా పార్టీ కార్యాలయంలోని ఫర్నీచర్ తో పాటు ఫ్లెక్సీలను, బ్యానర్లను అసమ్మతి నేతలు తగలబెట్టారు.అనంతరం చంద్రబాబు, లోకేశ్ కు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.అనంతపురం అర్బన్ టికెట్ ను దగ్గుబాటి ప్రసాద్ కు కేటాయించడంపై అసమ్మతి నేతలు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు.