1.అసెంబ్లీలో ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి పై సస్పెన్షన్ వేటు
ఏపీ అసెంబ్లీలో వైసిపి రెబల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి( Kotamreddy Sridhar Reddy ) పై సస్పెన్షన్ వేడుపడింది.శ్రీధర్ రెడ్డి తో పాటు , 12 మంది టీడీపీ ఎమ్మెల్యేలను స్పీకర్ సస్పెండ్ చేశారు.
2.మద్యం విధానం పై కేజ్రివాల్ కీలక నిర్ణయం
పాత మద్యం విధానాన్ని మరో ఆరు నెలలపాటు కొనసాగించాలని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్( kejriwal ) నిర్ణయించుకున్నారు.
3.అందుబాటులోకి కెనరా బ్యాంకు రూపే క్రెడిట్ కార్డులు
కెనరా బ్యాంక్ రూపే క్రెడిట్ కార్డులను కూడా యూపీఐ పరిధిలోకి తీసుకువచ్చారు.ఈ విషయాన్ని ఎన్ పి సి ఐ మేనేజింగ్ డైరెక్టర్ సీఈఓ దిలీప్ అభ్సే అధికారికంగా ప్రకటించారు.
4.హైదరాబాదులో కాంగ్రెస్ నేతల అరెస్ట్
ఆదాని షేర్ల పతనం అంశాలపై పార్లమెంటరీ కమిటీ వేయాలని , క్రోని కాపటాలిజం కు వ్యతిరేకంగా ఏఐసిసి ఇచ్చిన పిలుపు మేరకు టిపిసిసి ఆధ్వర్యంలో చలో రాజ్ భవన్ కు పిలుపునిచ్చారు ఈ క్రమంలో ర్యాలీగా రాజ్ భవన్ కు వెళ్తున్న నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు.
5.కంటతడి పెట్టిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే రాజయ్య
టిఆర్ఎస్ ఎమ్మెల్యే రాజయ్య కంటతడి పెట్టారు.స్టేషన్ ఘన్ పూర్ లో జరుగుతున్న రాజకీయ పరిణామాలు, తనపై వస్తున్న లైంగిక ఆరోపణల నేపథ్యంలో ఆయన భావోద్వేగానికి గురై కంట తడి పెట్టారు.
6.మహిళా కమిషన్ కు షర్మిల ఫిర్యాదు
వైయస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిల బుధవారం బీఆర్ఎస్ నేతలపై జాతీయ మహిళా కమిషన్ కు ఫిర్యాదు చేశారు.
7.‘జస్టిస్ ఫర్ వివేక ‘ అంటూ చంద్రబాబు ట్వీట్
మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్యకు గురైన సందర్భంగా టిడిపి అధినేత చంద్రబాబు( Chandrababu Naidu ) జస్టిస్ ఫర్ వివేక ‘ ‘ అంటూ ట్విట్ చేశారు.
8.లోకేష్ పాదయాత్ర
టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేపట్టిన యువ గళం పాదయాత్ర నేటికి 43వ రోజుకు చేరుకుంది.ప్రస్తుతం లోకేష్ పాదయాత్ర అన్నమయ్య జిల్లాలోని తంబళ్లపల్లె నియోజకవర్గం లో కొనసాగుతోంది.
9.కవిత మాజీ ఆడిటర్ ను విచారిస్తున్న ఈడి
ఢిల్లీ లిక్కర్ స్కామ్, మనీలాండరింగ్ కేసులో కవిత మాజీ ఆడిటర్ గోరంట్ల బుచ్చిబాబును ఈడి అధికారులు విచారిస్తున్నారు.
10.పవన్ వ్యాఖ్యలపై సోము వీర్రాజు స్పందన
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నిన్న మచిలీపట్నం సభలో బిజెపిపై చేసిన వ్యాఖ్యలపై ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు స్పందించారు.టిడిపి తో పొత్తు పై జనసేన పార్టీ క్లారిటీ ఇచ్చిన తర్వాత తమ భవిష్యత్ కార్యాచరణను ప్రకటిస్తామని వీర్రాజు అన్నారు.
11. జనసేన పై మంత్రి అమర్నాథ్ కామెంట్స్
జనసేనకు పదేళ్లుగా అజెండా లేదని , ఎన్నికల్లో పోటీ చేసే ధైర్యం లేదని ఏపీ మంత్రి గుడివాడ అమర్నాథ్ విమర్శించారు.
12.పవన్ పై పేర్ని నాని కామెంట్స్
తొడలు కొట్టే రాజకీయం పవన్ కళ్యాణ్ దేనిని మాజీ మంత్రి మచిలీపట్నం వైసిపి ఎమ్మెల్యే పేర్ని నాని విమర్శించారు.
13.ఢిల్లీ టూర్ కు కవిత
హైదరాబాద్ నుంచి ఢిల్లీకి ఎమ్మెల్సీ కవిత( Kavitha ) బయలుదేరి వెళ్లారు.రౌండ్ టేబుల్ సమావేశంలో కవిత పాల్గొంటారు .అలాగే రేపు జరగబోయే ఈడీ విచారణకు ఆమె హాజరవుతారు.
14.ఇంటర్మీడియట్ పరీక్షలు
నేటి నుంచి ఏపీ తెలంగాణలో ఇంటర్మీడియట్ పరీక్షలు ప్రారంభం అయ్యాయి.
15.రెండో రోజు అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు
ఏపీ అసెంబ్లీ సమావేశాలు రెండో రోజు కొనసాగుతున్నాయి. రేపు ఆర్థిక మంత్రి బుగ్గన రాజేందర్ నాథ్ రెడ్డి బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు.
16.యూత్ కాంగ్రెస్ శిక్షణా తరగతులు
నేటి నుంచి ఏపీ యూత్ కాంగ్రెస్ శిక్షణ తరగతులు ప్రారంభం కానున్నాయి.ఈ కార్యక్రమానికి ఏపీ కాంగ్రెస్ అధ్యక్షుడు గిడుగు రద్దరాజు హాజరుకానున్నారు.
17.వివేకానంద రెడ్డి వర్ధంతి
పులివెందులలో నేడు మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి వర్ధంతి జరిగింది.ఈ కార్యక్రమానికి ఆయన కుటుంబ సభ్యులు హాజరయ్యారు.
18.ఎన్టీఆర్ పై బాలకృష్ణ కామెంట్స్
సినీ రాజకీయ రంగంలో ఎన్టీఆర్ది చెరగని ముద్ర వేశారని నందమూరి బాలకృష్ణ అన్నారు.గుంటూరు జిల్లా తెనాలిలో బాలకృష్ణ పర్యటించిన సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేశారు.
19.జగన్ కు కేవీపీ లేఖ
కేంద్రంతో రాజీవ్ పడితే రాష్ట్రానికి ద్రోహం చేసినట్లేనని వైసీపీ అధినేత ఏపీ సీఎం జగన్ కు కాంగ్రెస్ సీనియర్ నేత , రాజ్యసభ మాజీ సభ్యుడు
కెవిపి రామచంద్ర రావు
లేఖ రాశారు.