ఇటీవల కాలంలో ప్రధాన నగరాల్లో వీధి కుక్కల (Stray dogs)దాడులు పెరుగుతూ, అనేక మంది ప్రాణాలను కోల్పోతుండగా, మరికొందరు తీవ్ర గాయాల పాలవుతున్నారు.తాజాగా హైదరాబాద్ నగరంలోని రాజేంద్రనగర్(Rajendranagar ,Hyderabad city) పరిధిలో ఇలాంటి భయంకర ఘటన ఒకటి చోటుచేసుకుంది.
రాజేంద్రనగర్ లోని గోల్డెన్ హైట్స్ కాలనీలో రోడ్డుపై వెళ్తున్న ఆరు సంవత్సరాల బాలికపై వీధి కుక్కలు అకస్మాత్తుగా దాడి చేశాయి.చిన్నారి భయంతో గట్టిగా అరవడంతో, సమీపంలో ఉన్న స్థానికులు తక్షణమే స్పందించి కుక్కలను తరిమివేసి బాలికను రక్షించారు.
అయితే, ఈ దాడిలో చిన్నారికి తీవ్ర గాయాలు కావడంతో ఆమెను వెంటనే ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు.
ఈ ఘటనపై స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.వీధి కుక్కల(Stray dogs) సమస్యపై ఎన్నిసార్లు ఫిర్యాదులు చేసినా మున్సిపల్ అధికారులు స్పందించలేదని వారు ఆరోపిస్తున్నారు.తమ కాలనీలో చాలా కాలంగా వీధి కుక్కల సంఖ్య పెరుగుతూ, పిల్లలు, వృద్ధులు(Children, the elderly) భయంతో బయటకు వెళ్లలేని పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.“ఇంకెంతమంది బలవ్వాలి?” అని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు.
ఈ సంఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది.వీధి కుక్కల సమస్యపై ప్రభుత్వం, మున్సిపల్ అధికారులు తక్షణ చర్యలు తీసుకోవాలని నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు.మునిసిపల్ అధికారులు వీధి కుక్కలను గుర్తించి స్టెరిలైజేషన్ (జనన నియంత్రణ) చేపట్టాలి.
కుక్కల సమస్య ఎదుర్కొంటున్న ప్రజలు ఫిర్యాదు చేయడానికి ప్రత్యేక హెల్ప్‌లైన్ ఏర్పాటు చేయాలి.వీధి కుక్కల సంరక్షణ కోసం ప్రత్యేక డోగ్ షెల్టర్లు ఏర్పాటు చేసి, వాటిని నియంత్రించాలి.
వీధి కుక్కల ప్రవర్తన, వాటి నుంచి ఎలా రక్షించుకోవాలో జనాలకు అవగాహన కల్పించాలి.ప్రభుత్వం, మున్సిపల్ అధికారులు వేగంగా చర్యలు తీసుకుంటేనే ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రజలు భయాందోళన లేకుండా జీవించగలరు.
మీ ప్రాంతంలో కూడా ఇలాంటి సమస్య ఉందా? ఎలాంటి చర్యలు తీసుకోవాలి అని మీరు భావిస్తున్నారు?
.