మహా కుంభమేళాకు( Maha Kumbh Mela ) సౌత్ ఇండియా నుంచి ప్రముఖ సెలబ్రిటీలు హాజరవుతున్న సంగతి తెలిసిందే.ప్రపంచంలోని అతి పెద్ద అధ్యాత్మిక వేడుక అయిన మహా కుంభమేళాకు సామాన్య ప్రజలు సైతం ఎక్కువ సంఖ్యలో హాజరవుతున్నారు.
త్రివేణి సంగమంలో పవిత్ర స్నానాలను ఆచరిస్తున్నారు.అయితే కన్నడ హీరోయిన్ పవిత్ర గౌడ( heroine Pavitra Gowda ) సైతం మహా కుంభమేళాలో పవిత్ర స్నానాన్ని ఆచరించారు.
రేణుకాస్వామి హత్య కేసులో పవిత్ర గౌడ నిందితురాలిగా ఉన్నారు.ప్రయాగ్ రాజ్ మహా కుంభమేళాలో పవిత్ర గౌడ కనిపించారు.మౌని అమవాస్య రోజున త్రివేణి సంగమంలో అమృత స్నానం ఆచరించగా అందుకు సంబోధించిన ఫోటోలు, వీడియోలు నెట్టింట తెగ వైరల్ అవుతుండటం గమనార్హం.పవిత్ర గౌడ మీడియాతో మాట్లాడుతూ మౌని అమవాస్య రోజున మహాకుంభమేళాలో స్నానం ఆచరించడాన్ని ఆశీర్వాదంగా భావిస్తున్నానని ఆమె చెప్పుకొచ్చారు.

నాకు నెగిటివ్ ఎనర్జీ నుంచి స్వేచ్ఛ లభిస్తుందని నమ్ముతున్నానని పవిత్ర గౌడ కామెంట్లు చేశారు.సోషల్ మీడియాలో పవిత్ర ఫోటోలను షేర్ చేయడంతో పాటు హరహర మహాదేవ్ ( Harahara Mahadev )అని క్యాప్షన్ ను జోడించారు.అయితే పవిత్ర గౌడ్ చేసిన పోస్ట్ ను నెటిజన్లు సోషల్ మీడియా వేదికగా వైరల్ చేస్తుండటం గమనార్హం.ఒక ఫ్యామిలీని రోడ్డున పడేసి స్వేచ్చగా తిరుగుతున్నావా అంటూ ఆమెపై కామెంట్లు చేస్తున్నారు.

అయితే తన గురించి వచ్చిన విమర్శల గురించి పవిత్ర గౌడ రియాక్ట్ అయ్యారు.మతానికి అన్యాయానికి జరిగిన సంఘర్షణలో మతమే గెలుస్తుందని ఆమె పేర్కొన్నారు.నన్ను తిడుతూ నన్ను బాధ పడుతున్న న్యూస్ ఛానెళ్లు సోషల్ మీడియా సైట్స్‌కు చాలా పెద్ద థాంక్స్.అని పవిత్ర గౌడ పేర్కొన్నారు.పవిత్ర గౌడ చేసిన కామెంట్లు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నాయి.పవిత్ర గౌడకు కఠిన శిక్ష విధించాలని నెటిజన్ల నుంచి కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.