ఎటువంటి డైట్ అక్కర్లేదు.. రోజు నైట్ ఈ డ్రింక్ తీసుకుంటే అధిక బరువుకు గుడ్ బై చెప్పవచ్చు!

ప్రస్తుత రోజుల్లో కోట్లాది మందికి అధిక బరువు ( overweight ) అనేది అతిపెద్ద సమస్యగా మారిపోయింది.బరువు పెరగడానికి బహుళ కారణాలు ఉంటాయి.

 Say Goodbye To Overweight With This Drink-TeluguStop.com

అస్థిరమైన ఆహార విధానం, నిశ్చల జీవనశైలి, జీవక్రియ వ్యాధులు, కొన్ని రకాల మందుల వాడకం, థైరాయిడ్ తదితర కారణాల వల్ల బరువు పెరుగుతారు.బరువు పెరగడం వల్ల శరీర ఆకృతి పూర్తిగా మారిపోతుంది.

పైగా టైప్ 2 డ‌యాబెటిస్‌, అధిక రక్తపోటు, గుండె పోటు, అధిక కొలెస్ట్రాల్, పీసీఓడీ, వంధ్యత్వం, గౌట్ తో సహా ఎన్నో జబ్బులకు అధిక బరువు మూలం అవుతుంది.అందుకే పెరిగిన బరువును తగ్గించుకోవడం కోసం నానా తంటాలు పడుతుంటారు.

కఠినమైన డైట్ ను ఫాలో అవుతుంటారు.కానీ ఎటువంటి డైట్‌ లేకుండా కూడా బరువు తగ్గొచ్చు.అందుకు ఇప్పుడు చెప్పబోయే డ్రింక్ చాలా బాగా సహాయపడుతుంది.రోజు నైట్ ఈ డ్రింక్ ను కనుక తీసుకుంటే అధిక బరువుకు గుడ్ బై చెప్పవచ్చు.

అందుకోసం ముందుగా స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకుని అందులో ఒక గ్లాసు వాటర్ పోసుకోవాలి.వాటర్ హీట్‌ అవ్వగానే అందులో వన్ టేబుల్ స్పూన్ ధనియాలు ( Coriander )వేసుకోవాలి.

అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ అల్లం తురుము( Grate ginger ) , పావు టేబుల్ స్పూన్ మిరియాల పొడి, ప‌ది నుంచి ప‌న్నెండు ఫ్రెష్ పుదీనా ఆకులు వేసి మరిగించాలి.

Telugu Bedtime, Tips, Latest, Goodbye-Telugu Health

దాదాపు పదిహేను నిమిషాల పాటు మరిగించిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి.స్ట్రైనర్ సహాయంతో వాటర్ ను ఫిల్టర్ చేసుకుని గోరువెచ్చగా అయిన తర్వాత సేవించాలి.రోజు నైట్ నిద్రించడానికి గంట ముందు ఈ డ్రింక్ ను కనుక తీసుకుంటే జీవక్రియ చురుగ్గా మారుతుంది.

శరీరంలో అధిక కేలరీలు వేగంగా బర్న్ అవుతాయి.దాంతో మీరు వెయిట్ లాస్ అవుతారు.

Telugu Bedtime, Tips, Latest, Goodbye-Telugu Health

బరువు తగ్గాలి అనుకుంటున్న వారికి ఈ డ్రింక్ చాలా బాగా సహాయపడుతుంది.ఈ డ్రింక్ ను రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవడం తో పాటు ప్రతిరోజూ కనీసం 40-45 నిమిషాలు వ్యాయామం చేయండి.ఒత్తిడికి దూరంగా ఉంచండి.పోషకాలతో కూడిన ఆహారాన్ని తీసుకోండి.జంక్ ఫుడ్ మానుకోండి.చక్కెర మరియు సాఫ్ట్ డ్రింక్స్ ను నివారించండి.

ఆల్కహాల్ తీసుకోవడం కూడా తప్పనిసరిగా మానుకోండి.అప్పుడే మీ శ‌రీర బ‌రువు అదుపులోకి వ‌స్తుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube