ఏపీలో పోలింగ్ తేదీ దగ్గర పడుతున్న కొద్దీ ఆయా పార్టీల అధినేతలు ఎన్నికల ప్రచారాన్ని మరింత ఉధృతం చేశారు.తమ రాజకీయ ప్రత్యర్థులపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తూ.
జనాలను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు.ఒకపక్క వైసీపీ అధినేత , ఏపీ సీఎం జగన్ బస్సు యాత్ర చేపడుతూ జనాలకు మరింత దగ్గరయ్యే విధంగా ప్రయత్నాలు చేస్తూ ఉండగా .మరోవైపు టిడిపి అధినేత చంద్రబాబు ఒకపక్క జగన్ పైన విమర్శలు చేస్తూ, మరోవైపు టిడిపి( TDP ) కూటమిని గెలిపించాల్సిందిగా కోరుతూ మండుటెండను సైతం లెక్కచేయకుండా ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు.
తెనాలికి చంద్రబాబు
ఈరోజు ఎన్నికల ప్రచారంలో భాగంగా తెనాలిలో టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు( Chandrababu Naidu ) పర్యటించనున్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రత్యేక హెలికాప్టర్ లో సాయంత్రం ఐదు గంటలకు చంద్రబాబు తెనాలి చేరుకుంటారు.సాయంత్రం 6 గంటలకు మార్కెట్ సెంటర్ వద్ద జరిగే బహిరంగ సభలో చంద్రబాబు పాల్గొని ప్రసంగించనున్నారు .ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు సమక్షంలో కొంతమంది వైసీపీ నాయకులు టిడిపిలో చేరనున్నట్లు ఆ పార్టీ వర్గాలు పేర్కొన్నాయి.
జగన్ బస్సు యాత్ర
ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈరోజు ప్రకాశం జిల్లా కొండేపి నియోజకవర్గం తో పాటు, మైదుకూరు, పీలేరులలో ఎన్నికల ప్రచారంలో జగన్( YS Jagan Mohan Reddy ) పాల్గొన బోతున్నారు.టంగుటూరులో ఏర్పాటుచేసిన బహిరంగ సభలో జగన్ పాల్గొంటారు. ప్రకాశం జిల్లాలో జగన్ పర్యటన కొనసాగనుంది.
కొండేపి నియోజకవర్గం టంగుటూరులో ఎన్నికల ప్రచారంలో పాల్గొనబోతున్న జగన్ అక్కడ ఏర్పాటుచేసిన సభలో ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారు.మధ్యాహ్నం 12:30 కి మైదుకూరు నాలుగు రోడ్ల జంక్షన్ లో జగన్ ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు.అక్కడ ఏర్పాటు చేసిన సభలో పాల్గొంటారు.మధ్యాహ్నం మూడు గంటలకు కనిగిరి లో ఎన్నికల ప్రచార సభలో జగన్ పాల్గొంటారని వైసిపి వర్గాలు పేర్కొంటున్నాయి.