డాండ్రఫ్ లేదా చుండ్రు.కోట్లాది మందికి కామన్ శత్రువు ఇది.అందులోనూ ప్రస్తుత వింటర్ సీజన్ లో చుండ్రు అనేది చాలా అధికంగా వేధిస్తూ ఉంటుంది.ఈ సమస్య నుంచి బయట పడటం కోసం ఖరీదైన షాంపూ ను వాడుతుంటారు.
ఎన్నెన్నో హెయిర్ ప్యాక్ లు, మాస్కులు వేసుకుంటారు.అయితే ఇప్పుడు చెప్పబోయే హోమ్ మేడ్ సీరంను కనుక వాడితే చుండ్రు ఎంత తీవ్రంగా ఉన్నా సరే ఇట్టే దూరం అవుతుంది.
మరి ఇంకెందుకు ఆలస్యం ఆ హోమ్ మేడ్ సీరం ను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకుందాం పదండి.
ముందు ఐదు వెల్లుల్లి రెబ్బలు తీసుకుని శుభ్రంగా పొట్టు తొలగించాలి.
ఇలా పొట్టు తొలగించిన వెల్లుల్లి రెబ్బలను మెత్తగా పేస్ట్ చేసి జ్యూస్ ను సపరేట్ చేసుకోవాలి.అలాగే రెండు ఉసిరి కాయలు తీసుకుని నీటిలో శుభ్రంగా కడిగి గింజ తొలగించి ముక్కలుగా కట్ చేసుకోవాలి.
ఈ ముక్కలను కూడా మెత్తగా పేస్ట్ చేసి జ్యూస్ ను వేరు చేసుకోవాలి.
ఇప్పుడు ఒక బౌల్ తీసుకుని అందులో మూడు టేబుల్ స్పూన్లు వెల్లుల్లి జ్యూస్, ఎనిమిది టేబుల్ స్పూన్లు ఉసిరి జ్యూస్, రెండు టేబుల్ స్పూన్లు ఆముదం, వన్ టేబుల్ స్పూన్ అలోవెరా జెల్ వేసుకుని అన్నీ కలిసేంత వరకు బాగా మిక్స్ చేసుకోవాలి.
తద్వారా మన హోమ్ మేడ్ హెయిర్ సీరం సిద్దం అవుతుంది.

ఈ హెయిర్ సీరం ను ఒక బాటిల్ లో నింపుకొని ఫ్రిడ్జ్ లో స్టోర్ చేసుకోవాలి.నైట్ నిద్రించే ముందు ఈ హెయిర్ సీరం తలకు బాగా పట్టించాలి.మరుసటి రోజు ఉదయాన్నే మైల్డ్ షాంపూను యూస్ చేసి గోరు వెచ్చని నీటితో శుభ్రంగా తల స్నానం చేయాలి.
వారంలో రెండు సార్లు ఈ హోమ్ మేడ్ హెయిర్ సీరం ను వాడితే చుండ్రు దెబ్బకు పరార్ అవుతుంది.అలాగే ఈ సీరం ను వాడటం వల్ల జుట్టు రాలడం సైతం కంట్రోల్ అవుతుంది.