ప్రస్తుత రోజుల్లో మేకప్ లేకుండా కాలు బయటపెట్టడానికి ఎవరూ ఇష్టపడటం లేదు.చాలా మంది అమ్మాయిలకు మేకప్ అనేది డైలీ రొటీన్‌లో ఒకటిగా అయిపోయింది.
అందంగా కనిపించడం కోసం మేకప్ తో వివిధ రకాలుగా మెరుగులు దిద్దుకుంటున్నారు.అయితే ఇప్పుడు చెప్పబోయే సింపుల్ రెమెడీని ట్రై చేస్తే మేకప్ అక్కర్లేదు.
సహజంగానే అందంగా మెరిసిపోతారు.మరి ఇంకెందుకు ఆలస్యం ఆ రెమెడీ ఏంటో.
దాన్ని ఎలా సిద్ధం చేసుకోవాలో.తెలుసుకుందాం పదండీ.
ముందుగా ఒక టమాటోను తీసుకుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేశారు.అలాగే ఒక చిన్న కీరదోసను కూడా తీసుకుని సన్నగా స్లైసెస్‌గా కట్ చేసుకోవాలి.ఇప్పుడు బ్లెండర్ తీసుకుని అందులో కట్ చేసి పెట్టుకున్న టమాటో ముక్కలు, కీరదోస స్లైసెస్, వన్ టేబుల్ స్పూన్ లెమన్ జ్యూస్, ఆరు టేబుల్ స్పూన్లు పచ్చి పాలు, చిటికెడు పసుపు వేసుకుని మెత్తటి పేస్ట్‌లా గ్రైండ్ చేసుకోవాలి.
ఇలా గ్రైండ్ చేసి పెట్టుకున్న మిశ్రమంలో వన్ టేబుల్ స్పూన్ ఆరెంజ్ పీల్ పౌడర్, వన్ టేబుల్ స్పూన్ ముల్తానీ మట్టి వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి.
ఈ మిశ్రమాన్ని ఏదైనా బ్రష్ సాయంతో ముఖానికి, మెడకు అప్లై చేసుకోవాలి.ఇరవై నిమిషాల పాటు ఆరబెట్టుకుని.అనంతరం చల్లటి నీటితో శుభ్రంగా చర్మాన్ని క్లీన్ చేసుకోవాలి.ఆపై ఏదైనా మాయిశ్చరైజర్ లేదా సీరమ్ ను రాసుకోవాలి.

ఈ న్యాచురల్ హోం రెమెడీని రోజుకు ఒకసారి పాటిస్తే చర్మం నిగారింపుగా, కాంతివంతంగా మారుతుంది.చర్మంపై ఏమైనా మొండి మచ్చలు, మొటిమలు ఉంటే క్రమంగా తొలగిపోతాయి.స్కిన్ టోన్ ఇంప్రూవ్ అవుతుంది.మేకప్ లేకపోయినా మీ ముఖ చర్మం అందంగా, ఆకర్షణీయంగా మెరుస్తుంది.కాబట్టి తప్పకుండా ఈ హోం రెమెడీని ట్రై చేయండి.