మంగళగిరిలో టీడీపీకి షాక్ తగిలింది.నారా లోకేశ్ నియోజకవర్గంలో కీలక నేతగా వ్యవహరించిన గంజి చిరంజీవి వైసీపీ గూటికి చేరారు.
సీఎం జగన్ సమక్షంలో ఆయన వైసీపీ కండువా కప్పుకున్నారు.ఈ సందర్భంగా జగన్ ఆయనను పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు.
టీడీపీలో బీసీలకు సరైన గౌరవం లేదని.నిరంతరం బీసీలను అవమానాలకు గురి చేస్తున్నారని గంజి చిరంజీవి తెలిపారు.
వైసీపీ ప్రభుత్వ పాలనలోరాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలు సంతోషంగా ఉన్నారని.అందుకే వైసీపీలోకి వచ్చినట్లు వెల్లడించారు.







