ఏపీ సీఎం జగన్( AP CM Jagan ) ఎన్నికల ప్రచార యాత్ర జోరుగా కొనసాగుతోంది.ఇందులో భాగంగా ఇవాళ ఆయన మూడు జిల్లాల్లోని నియోజకవర్గాల్లో పర్యటించనున్నారు.
ఈ క్రమంలో వైసీపీ అభ్యర్థులకు మద్ధతుగా ఎన్నికల ప్రచారాన్ని సీఎం జగన్ నిర్వహించనున్నారు.ముందుగా ఒంగోలు పార్లమెంట్ పరిధిలో ఆయన పర్యటించనున్నారు.
కొండెపిలో ఏర్పాటు చేసిన సభలో సీఎం జగన్ పాల్గొననున్నారు.తరువాత మధ్యాహ్నం 12.30 గంటలకు మైదుకూరులో జగన్ ప్రచారం చేయనున్నారు.అక్కడి నుంచి పీలేరుకు వెళ్లనున్న సీఎం జగన్ ఆ నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన ప్రచార సభలో పాల్గొననున్నారు.
ఐదేళ్ల పాలనలో వైసీపీ ప్రభుత్వం చేసిన అభివృద్ధి, అందించిన సంక్షేమాన్ని సీఎం జగన్ ప్రజలకు వివరిస్తున్నారు.అయితే ఇటీవల నిర్వహించిన సిద్ధం సభలు విజయవంతం కావడంతో పాటు మేమంతా సిద్ధం బస్సు యాత్ర( Memantha Siddham Bus Yatra )కు ప్రజలు నీరాజనం పట్టిన సంగతి తెలిసిందే.
ఈ క్రమంలోనే వైసీపీ క్యాడర్ సైతం నయా జోష్ తో ముందుకు వెళ్తున్నారు.







