ఈ రోజు పంచాంగం (Today’s Telugu Panchangam):
సూర్యోదయం: ఉదయం 06.04
సూర్యాస్తమయం: సాయంత్రం 05.38
రాహుకాలం: ఉ.10.41 నుంచి 12.04 వరకు
అమృత ఘడియలు: ఉ.09.20 నుంచి 10.12 వరకు
దుర్ముహూర్తం: ఉ.08.23 నుంచి 09.09 వరకు
ఈ రోజు రాశి ఫలాలు(Today’s Telugu Rasi Phalalu):
మేషం:

ఈరోజు మేషరాశి వారికి అధిపతి అయిన అంగారకుడు మీనంలో సంచరించనున్నాడు.ఈ రాశి వారు ఈ రోజు ఎటువంటి పనులు అయినా ప్రారంభించేటప్పుడు ఒకటికి రెండుసార్లు ఆలోచించి నిర్ణయం తీసుకోవడం ఉత్తమం.ఏమాత్రం తొందరపడిన మీ ఆత్మ గౌరవం దెబ్బతినే అవకాశం ఉంటుంది.ఈ రోజు పోరాటం తో చేసే మీ పనులలో చివరికి విజయం మిమ్మల్ని వరిస్తుంది.
వృషభం:

ఈ రోజు వృషభ రాశి వారికి అధిపతి అయిన శుక్రుడు ఐదవ పాదంలో సంచరిస్తున్నాడు.ఫలితంగా సానుకూల ఫలితాలను అందుకుంటారు.అంతేకాకుండా ఈ రాశి వారికి ఈరోజు సంపద కలిగే సూచనలు కనిపిస్తున్నాయి.
కొత్తగా కాంట్రాక్ట్ వచ్చే అవకాశాలు ఉన్నాయి.శత్రువులకు మీ చేతిలో ఓటమిని చవి చూస్తారు.
మిథునం:

ఈ రోజు వృషభ రాశి వారికి అధిపతి అయిన శుక్రుడు ఐదవ పాదంలో సంచరిస్తున్నాడు.ఫలితంగా సానుకూల ఫలితాలను అందుకుంటారు.అంతేకాకుండా ఈ రాశి వారికి ఈరోజు సంపద కలిగే సూచనలు కనిపిస్తున్నాయి.కొత్తగా కాంట్రాక్ట్ వచ్చే అవకాశాలు ఉన్నాయి.శత్రువులకు మీ చేతిలో ఓటమిని చవి చూస్తారు.
కర్కాటకం:

కర్కాటకం రాశి వారికి చంద్రుడు అధిపతి.నేడు ఈ రాశివారికి చంద్రుడు 8 పాదంలో ఉండటం వల్ల ఖర్చులు పెరిగే అవకాశం ఉంటుంది.వ్యాపారంలో కొంతమేర నష్టాన్ని చవిచూస్తారు.
చేసేటటువంటి పనులలో ఆటంకం ఏర్పడుతుంది.సంతానం కోసం ఎదురు చూసేవారు శుభ వార్తను వింటారు.ఉద్యోగుల పై అధికారులు ఇచ్చే సూచనలు సలహాలతో కొంత మేర మీ పని ఆలస్యం అవుతుంది.
సింహం:

సింహ రాశికి అధిపతి అయిన సూర్యుడు ఈరోజు బుధుడితో కలిసి ఉండటం వల్ల ఈ రాశి వారికి అదృష్టం కలిసి వస్తుంది.బుద్ధుడు మూడవ స్థానంలో ఉండటం వల్ల వ్యాపార రంగంలో రాణిస్తారు.మీ మాట తీరుతో అందరినీ ఆకట్టుకుంటారు.
మీ చేతిలో ప్రత్యర్థులు ఓడిపోవడం వల్ల, సమాజంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి.ఈ రాశి వారు చేసేటటువంటి ప్రయాణాలలో లాభాలను అందుకుంటారు.
కన్య:

ఈరోజు కన్యరాశి వారికి అనుకోకుండా ఇంటికి అతిథులు వచ్చే అవకాశం ఉంది.ఈ రాశివారు నూతన పనిని ప్రారంభించాలనుకుంటే బాగా ఆలోచించి నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది.ఉద్యోగం, వ్యాపారం చేసే వారు ఈ రోజు మౌనంగా ఉండటం వల్ల వారికి ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది.ఈరోజు ఈ రాశి వారి కుటుంబ సభ్యుల ఆప్యాయతలతో గడుపుతారు.
తులా:

ఈ రాశి వారికి శుక్రుడు 12వ స్థానంలో ఉండటం వల్ల ఈ రాశి వారికి సానుకూల ఫలితాలు కనిపిస్తున్నాయి.ఈ రాశివారికి చంద్రుడు 11వ స్థానంలో ఉండటం వల్ల సౌందర్య వృద్ధిచెందుతుంది.బంధువుల మద్దతుతో చేసిన పొరపాట్లను సరిదిద్దుకోవడానికి ఇదే సరైన సమయం.వ్యాపారాలలో పెట్టుబడులు పెట్టడం వల్ల లాభాన్ని ఆర్జిస్తారు.
వృశ్చికం:

వృశ్చిక రాశి వారికి అంగారకుడు 5 పాదంలో ఉండటం వల్ల మీ పనులు మెరుగుపడతాయి.భార్య భర్తలు మంచి సమయాన్ని గడుపుటకు ఎంతో అనువైన రోజు.ఈ రాశివారికి ఈ రోజు అధిక ఖర్చులు వచ్చే అవకాశం ఉంది.వీలైనంత వరకు ఎవరితో గొడవ పడకుండా, తగాదాలకు దూరంగా ఉండడం ఎంతో మంచిది.
ధనస్సు:

ఈ రాశి వారికి దేవగురువైన బృహస్పతి అధిపతి.చాలా కాలం నుంచి బృహస్పతి ధనస్సు రాశిలో ఉండటం వల్ల, ఇంట్లో సంపద పెరిగే అవకాశం ఉంది.ఎన్నో రోజులుగా వెంటాడుతున్న సమస్యను పరిష్కరించుకోవడానికి ప్రయత్నం చేయగా, దానిలో విజయం సాధిస్తారు.
మకరం:

ఈ రోజు మకర రాశి వారికి అధిపతి శని.ఈ రాశి వారికి ప్రథమ పాదంలో చంద్రుడు ఉన్నాడు.ఈ రాశివారు ఈరోజు తీరిక లేకుండా గడుపుతారు.
వ్యాపారంపై దృష్టి సారించడం వల్ల అస్తవ్యస్తంగా ఉన్న పనులను గాడిలోకి తెస్తారు.లావాదేవీల విషయాల్లో, ప్రణాళికా కాలంలో ఈ రాశివారు ఎంతో జాగ్రత్తగా వ్యవహరించాలి.
కుంభం:

కుంభరాశి వారికి అధిపతి అయిన గురుడు 11 పాదంలో, చంద్రుడు మీన రాశిలో ఉండటం వల్ల ఈ రాశి వారికి అదృష్టం కలిసి వస్తుంది.మీకు ఇష్టమైన వారి సహాయంతో విజయాన్ని సొంతం చేసుకుంటారు.నూతన వ్యక్తులతో పరిచయం ఏర్పడుతుంది.ఈ రాశి వారి వైవాహిక జీవితంలో ఎంతో ఆనందంగా గడుపుతారు.
మీనం:

ఈ రాశి వారికి అధిపతి అయిన బృహస్పతి 10 పాదంలో, త్రికోణాకారంలో కదలడం వల్ల అనుకున్న కోరికలు నెరవేరే సూచనలున్నాయి.అంతేకాకుండా శుభకార్యాలలో పాల్గొంటారు.నూతన పనులను ప్రారంభించాలనుకునేవారికి ఇది సరైన సమయం.ఈ రాశి వారు రాత్రి సమయం కుటుంబ సభ్యులతో గడపడం ఎంతో మంచిది.ఈ రాశి వారు వినోదం కోసం కొంత డబ్బును ఖర్చు చేయాల్సిన సూచనలు కనిపిస్తున్నాయి.