మన దేశంలో వాస్తు శాస్త్రాన్ని( Vastu Shastra ) చాలా మంది ప్రజలు నమ్ముతారు.వాస్తు శాస్త్రంలో ఇంట్లోనీ పూజ గది చాలా ముఖ్యమని పండితులు( Scholars ) చెబుతున్నారు.
దాదాపు ప్రతి ఒక్కరి ఇంట్లో పూజకు ప్రత్యేకంగా గదిని కేటాయిస్తారు.అలాగే ప్రతి రోజు ఉదయం, సాయంత్రం దేవుడిని పూజిస్తూ, దేవుడి ముందు దీపం వెలిగిస్తారు.
దీపం నుంచి వెలువడే వెలుగు శుభానికి చిహ్నం అని పండితులు చెబుతున్నారు.కాబట్టి పూజ గదిలో దీపం వెలిగించడం వల్ల ఇంటికి తేజస్సు, సానుకూలత వస్తాయి.
కాబట్టి దీపం వెలిగించడం ఆశకు చిహ్నంగా చాలా మంది ప్రజలు భావిస్తారు.
అయితే వాస్తు శాస్త్రం ప్రకారం పూజ గది( Pooja room )లో ఏ దిక్కున దీపం పెట్టాలో ఇప్పుడు తెలుసుకుందాం.దీపం వెలిగించడం వల్ల ఇంట్లో ఉన్న ప్రతికూల శక్తులు( Negative forces ) బయటకు వెళ్లిపోతాయి.హిందూ ధర్మం ప్రకారం దేవుళ్ళ ముందు నెయ్యి, నూనె దీపాలను వెలిగిస్తూ ఉంటారు.
ముఖ్యంగా చెప్పాలంటే ఎడమ చేతితో నెయ్యి దీపం వెలిగించాలని, కుడి చేతితో నూనె దీపం వెలిగించాలని పండితులు చెబుతున్నారు.వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లో దీపం ఎప్పుడూ వెలిగించడం వల్ల ఇంట్లోకి సానుకూల శక్తి వస్తుంది.
అలాగే ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ బయటకి వెళ్ళిపోతుంది.
అమ్మవారికి దీపపు కాంతి అంటే ఎంతో ఇష్టం.కాబట్టి పూజా సమయం( Pooja time )లో దీపం వెలిగించడం శుభ్రంగా భావిస్తారు.వాస్తు శాస్త్రం ప్రకారం ఇంటికి పశ్చిమ దిశలో దీపం వెలిగించడం అత్యంత శుభప్రదంగా చెబుతున్నారు.
పడమర దిక్కున దీపం వెలిగించడం ద్వారా లక్ష్మీదేవి ఇంట్లోకి వస్తుందని చాలామంది ప్రజలు నమ్ముతారు.దీనితో పాటు సానుకూల శక్తి, ఆనందం, శ్రేయస్సు కూడా కలుగుతాయి.ముఖ్యంగా చెప్పాలంటే దీపం వెలిగించకుండా ఏ పూజ,శుభకార్యాలు పూర్తి కావని పండితులు చెబుతున్నారు.ఇంట్లో లేదా దేవాలయంలో ఏదైనా మతపరమైన పనులకు ముందు దేవతల ముందు దీపం వెలిగించడం మంచిదనీ పండితులు చెబుతున్నారు.
DEVOTIONAL