తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి దేవాలయంలో జరిగిన చొక్కాని ఉత్సవంలో అపశ్రుతి జరిగింది.చొక్కని దీపోత్సవంలో మంటలు చెలరేగాయి.
మంటలు భారీగా ఉండడంతో భక్తులు భయంతో పరిగెత్తారు.భారీ భక్తులు తరలిరావడం వల్ల కాసేపు తోపులాట జరిగింది.
ప్రతి సంవత్సరం కార్తీక పౌర్ణమి నాడు శ్రీకాళహస్తి ముక్కంటి దేవాలయంలో చొక్కాని ఉత్సవం చేస్తూ ఉంటారు.ఇందులో భాగంగానే భారీ దీపోత్సవం ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది.
ఈ దేవాలయం పరిసరాల్లోనే దాదాపు 20 అడుగుల ఎత్తులో ఒక దీపాన్ని ఏర్పాటు చేసినట్లు అక్కడే అధికారులు చెబుతున్నారు.అయితే సరైన జాగ్రత్తలు తీసుకుకపోవడం వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు కూడా అక్కడి అధికారులు, భక్తులు చెబుతున్నారు.
ఈ దీపోత్సవానికి చాలామంది భక్తులు హాజరయ్యారు.
చుట్టూ భక్తులు కూర్చుని ఉండగానే దీపోత్సవాన్ని ఏర్పాట్లు చేశారు.
ఒకసారిగా భారీగా మంటలు ఎగిసిపడడంతో ఆ మంటలు భక్తుల మీదకు పడ్డాయి.దీంతో భయభ్రాంతులకు గురైన భక్తులు మంటలకు భయపడి ఒక్కసారిగా పరుగు తీశారు.
దీంతో ఈ తోపులాటలో 8 మందికి గాయాలయ్యాయి.ఇందులో ముగ్గురు ఆలయ సిబ్బంది ఉండగా, ఐదుగురు భక్తులు అందరికీ స్వల్ప గాయాలే అయ్యాయి అని అందరూ ఊపిరిపించుకున్నారు.
ఇంకా చెప్పాలంటే ఆలయ సిబ్బందిలో మహిళా సెక్యూరిటీ గార్డుకు చెయ్యి విరిగినట్లు సమాచారం.
ఆమెను వీల్ చైర్ లో శ్రీకాళహస్తి ఏరియా అసుత్రికి తరలించి వెంటనే చికిత్స అందిస్తున్నారు.ఇంకా చెప్పాలంటే ఇలాంటి భారీ చొక్కాని దీపోత్సవం చుట్టూ ఎవరు భక్తులు లేకుండా అన్ని జాగ్రత్తలు పాటిస్తూ ఈ వేడుకలు చేసి ఉండాల్సింది.అయితే ఆలయ సిబ్బంది కాస్త నిర్లక్ష్యంగా ఈ కార్యక్రమం చేయడం, ఊహించని దానికన్నా అధికంగా భక్తులు రావడం, అదేవిధంగా మంటలు ఎగిసి పడడం వల్ల ఈ ప్రమాదం జరిగినట్లు అక్కడి ప్రజలు, అధికారులు, భక్తులు చెబుతున్నారు.
ఇప్పటి నుంచైనా కాస్త జాగ్రత్తలు తీసుకొని ఇలాంటి కార్యక్రమాలు చేస్తే మంచిదని ప్రజలు చెబుతున్నారు.
DEVOTIONAL