సాయి కుమార్.నటుడిగా, డబ్బింగ్ ఆర్టిస్ట్ గా అయన ఎదిగిన తీరు, కెరీర్ సాగిన విధానం పై అనేక సార్లు వింటున్నాం.
సాయి కుమార్ తన తండ్రి పి జె శర్మ గారి నటన మరియు డబ్బింగ్ వారసత్వం గా సినిమా ఇండస్ట్రీ కి ఎంట్రీ ఇచ్చాడు.ఆయన నటించడం మాత్రమే కాకుండా ప్రొడ్యూసర్ గా కూడా మారి సినిమాలు తీసాడు.
తండ్రి పెద్ద నటుడు అయినా సాయి కుమార్ మాత్రం కెరీర్ బిగినింగ్ లో చాల కష్టాలు పడ్డాడు.సాయి కుమార్ ది ఉమ్మడి కుటుంబం.
తండ్రి తర్వాత ఆ బాధ్యత మొత్తం తన పైన వేసుకున్నాడు.నటుడిగా కంటే ముందు వాయిస్ ఓవర్ ఆర్టిస్ట్ గా తన ప్రయాణం మొదలు పెట్టాడు.
తన అన్ని సమస్యల్లో తోడు గా ఉంది మాత్రం అతడి భార్య సురేఖ అంటూ ఉంటాడు సాయి కుమార్.సాయి కుమార్ తల్లి దండ్రుల బాధ్యత నుంచి మొదలు పెడితే అతడి ఇద్దరి తమ్ముళ్ల జీవితాలు సెట్ చేయడం లో కూడా సురేఖ పాత్ర చాల ఉంటుంది అంటూ ఉంటారు.
సంపాదించినా మొత్తం డబ్బు ని ఆమె చేతుల్లోనే పెట్టేవారట సాయి కుమార్.ఇంటి ఖర్చులు పోగా మిగిలిన డబ్బులను చక్కగా సేవ్ చేసేవారట.సాయి కుమార్ తమ్ముళ్లకు కావాల్సిన ఖర్చులు, పెళ్లిళ్లు అన్ని కూడా శర్మ గారి కంటే సురేఖ ఎక్కువగా అలోచించి నిర్ణయాలు తీసుకునేవారట.సాయి ని తమ కుటుంబం అయితే ఒక దేవుడిలా చూస్తారు.

ఇక కుటుంబాన్ని కాపాడిన దేవత గా సురేఖ ని భావిస్తారు.సంపాదిస్తున్న భర్త ను బయటకు తీసుకొని పోకుండా, కుటుంబానికి మొదట ప్రాధాన్యత ఇచ్చి అందరిని సెటిల్ చేయడానికి ఆమె శాయశక్తులా ప్రయత్నించింది.ఇక తన కుమారుడు అయినా ఆది కి కూడా తన సొంత తమ్ముడి కూతురితో వివాహం జరిపించింది.

అటు తల్లి గారి కుటుంబాన్ని, ఇటు అత్తగారి కుటుంబాన్ని బాగా సమన్వయపరచడం లో ఆమె ఎప్పుడు ఒక అడుగు ముందే ఉండేది.అప్పుల బాధ తట్టుకోలేక కుటుంబం అంత ఆత్మహత్య చేసుకోవాలనుకున్నప్పుడు దాసరి గారి తో మాట్లాడి ఆగిపోయిన తమ సినిమాను విడుదల చేయించింది సురేఖ.ఇక కొడుకు కెరీర్ సెట్ అవ్వలేదు అని కాస్త బాధ ఉన్న, మిగతా ఏ విషయాల్లో కూడా ఆమె కుటుంబానికి లోటు చేయలేదు.