తెలంగాణలో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు షెడ్యూల్ విడుదల అయింది.ఈ మేరకు శాసనమండలిలో రెండు ఖాళీ స్థానాలను భర్తీ చేయడానికి కేంద్ర ఎలక్షన్ కమిషన్( Central Election Commission ) షెడ్యూల్ ప్రకటించింది.
ఈనెల 11 న ఎన్నికకు నోటిఫికేషన్ విడుదల కానుంది.ఈనెల 29న రెండు స్థానాలకు ఎన్నికల సంఘం అధికారులు పోలింగ్ నిర్వహించనున్నారు.
అయితే ఎమ్మెల్యేలుగా ఎన్నికైన కడియం శ్రీహరి,( Kadiyam Srihari ) పాడి కౌశిక్ రెడ్డి( Padi Kaushik Reddy ) ఎమ్మెల్సీలుగా రాజీనామాలు చేసిన సంగతి తెలిసిందే.వీరి పదవీకాలం నవంబర్ 30, 2027 వరకు ఉన్నప్పటికీ రాజీనామాలు చేయడంతో ఉపఎన్నిక అనివార్యమైంది.
ఈ క్రమంలో ఈ రెండు స్థానాలకు 29న పోలింగ్ నిర్వహించి అదే రోజున ఫలితాలను వెల్లడించనున్నట్లు ఈసీ పేర్కొంది.