ఈ మధ్యకాలంలో బ్యాక్ గ్రౌండ్ లేకుండా సినిమా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి తమదైన శైలిలో సినిమాలు తీస్తూ ఇండస్ట్రీలో పాతుకుపోతున్న నటీనటులు ఎక్కువైపోతున్నారు.ఇంతకు ముందు పరిస్థితి ఇలా ఉండేది కాదు.
ఒక వ్యక్తి ఇండస్ట్రీకి వస్తున్నాడు అంటే దానికి ముందు బోలెడంత కసరత్తులు చేసుకునేవారు.కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది.
కొంచం నటించగలిగే టాలెంట్ ఉంటే చాలు అవకాశాలు ప్రతి ఒక్కరిని వెతుక్కుంటూ వెళ్ళిపోతున్నాయి.అలా ఈ మధ్యకాలంలో తమదైన టాలెంట్ తో తెలుగు సినిమా ఇండస్ట్రీలో మంచి గుర్తింపు తెచ్చుకున్న నటుడు ఎవరెవరు ఉన్నారో ఈ ఆర్టికల్ లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
తిరువీర్
2023వ సంవత్సరంలో పరేషాన్ సినిమాతో హిట్టు కొట్టాడు తీరు( Thiruveer )అంతేకాదు ఓటిటి ప్లాట్ ఫామ్ లో కుమారి శ్రీమతి అనే సిరీస్ కూడా మంచి విజయవంతం సాధించింది.మాసూద సినిమాతో మొట్టమొదటిసారి మంచి విజయాన్ని అందుకున్నాడు.ఆ తర్వాత ఆచితూచి సబ్జెక్ట్స్ ఎంచుకుంటూ మంచి కామెడీ కూడా పండిస్తున్నాడు.చూడ్డానికి ఆరడుగులు ఉండే ఈ అబ్బాయి అతి త్వరలోనే టాలీవుడ్ లో మంచి హీరో అయిపోతాడు ఎలాంటి సందేహం లేదు.ప్రస్తుతం తిరువీర్ చేతిలో మూడు సినిమాలు ఉన్నాయ్.
సత్యదేవ్
జూనియర్ ఆర్టిస్టుగా, చిన్న నటుడిగా సినిమా ఇండస్ట్రీకి వచ్చి ప్రస్తుతం లీడ్ రోల్స్ చేస్తూ అనేక సినిమాల్లో నటిస్తున్నాడు సత్యదేవ్.సత్యదేవ్( Sathya dev ) నిజానికి కొత్త నటుడేమీ కాదు కానీ చూపులతోనే నటించగలిగే సత్తా ఉన్న నటుడు.అందుకే సత్యదేవ్ లాంటి ఒక నటుడు ఇండస్ట్రీకి ఖచ్చితంగా అవసరం.2023 లో కృష్ణమ్మ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సత్య దేవ్ మరో మూడు సినిమాల్లో నటిస్తున్నాడు.
కార్తీక్ రత్నం
కేరాఫ్ కంచరపాలెం సినిమాతో వెలుగులోకి వచ్చి ఓవర్ నైట్ పాపులర్ అయిపోయాడు కార్తీక్ రత్నం( Karthik Ratnam )ఈ మధ్యకాలంలో ఓటిటి లో వ్యవస్థ అనే వెబ్ సిరీస్ తో కూడా అందరిని ఆకట్టుకున్నాడు.ఆ తర్వాత లింగోచా అని మరొక సినిమాలోను కనిపించగా 2024 మరొక ప్రాజెక్టుతో మన ముందుకు రాబోతున్నాడు.