టాలీవుడ్ ఇండస్ట్రీలో సక్సెస్ రేట్ పరంగా టాప్ డైరెక్టర్ రాజమౌళి( Rajamouli ) అనే సంగతి తెలిసిందే.రాజమౌళి డైరెక్షన్ లో తెరకెక్కిన 12 సినిమాలు ఒక సినిమాను మించి మరొకటి విజయం సాధించాయి.
అయితే ఈ విధంగా వరుస విజయాలు సాధించిన దర్శకులు లేరు.రాజమౌళి తర్వాత ఆ స్థాయి దర్శకుడు అనిల్ రావిపూడి( Anil Ravipudi ) మాత్రమేనని చెప్పవచ్చు.
వరుసగా 8 హిట్లు ఈ దర్శకుడి ఖాతాలో చేరాయి.
2013 సంవత్సరంలో పటాస్ సినిమాతో అనిల్ రావిపూడి కెరీర్ మొదలైంది.
సుప్రీం, రాజా ది గ్రేట్, ఎఫ్2, సరిలేరు నీకెవ్వరు, ఎఫ్3, భగవంత్ కేసరి, సంక్రాంతికి వస్తున్నాం సినిమాలతో అనిల్ రావిపూడి ఎక్కువగా విజయాలను అందుకున్నారు.కథకు అనుగుణంగా టైటిల్స్ ను ఎంచుకునే విషయంలో అనిల్ రావిపూడికి ఎవరూ సాటిరారని కచ్చితంగా చెప్పవచ్చు.
టాలీవుడ్ టాప్ హీరోలతో సినిమాలను తెరకెక్కించాలని అనిల్ రావిపూడి ఆశ పడుతుండగా ఏం జరుగుతుందో చూడాల్సి ఉంది.అనిల్ రావిపూడి భవిష్యత్తు సినిమాలకు సంబంధించిన ప్రకటనలు వెలువడాల్సి ఉంది.అనిల్ రావిపూడి చిరంజీవి కాంబినేషన్ లో ఒక సినిమా ఫిక్స్ అయ్యే అవకాశాలు ఉన్నాయని సమాచారం అందుతోంది.ఈ సినిమాతో అనిల్ రావిపూడి ట్రిపుల్ హ్యాట్రిక్ సాధించాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు.
దర్శకుడు అనిల్ రావిపూడి క్రేజ్, ఫ్యాన్ ఫాలోయింగ్, పాపులారిటీ అంతకంతకూ పెరుగుతోంది.అనిల్ రావిపూడి పాన్ ఇండియా సినిమాలను తెరకెక్కిస్తే ఈ దర్శకుడి ఖాతాలో మరిన్ని హిట్లు చేరడం పక్కా అని చెప్పవచ్చు.ఈ స్టార్ డైరెక్టర్ కెరీర్ ప్లాన్స్ ఏ విధంగా ఉండనున్నాయో చూడాల్సి ఉంది.పాన్ ఇండియా ప్రాజెక్ట్ లపై ఈ దర్శకుడు ఫోకస్ పెడితే ఇతర భాషల్లో సైతం ఈ దర్శకుడు సక్సెస్ సాధించడం మరీ కష్టమేం కాదని నెటిజన్ల నుంచి అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.