తాజాగా కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మక పద్మ పురస్కారాలని ప్రకటించిన విషయం తెలిసిందే.అయితే ఈ విషయం పట్ల తెలంగాణకు చాలా అన్యాయం జరిగిందని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి( CM Revanth Reddy ) వాపోయారు.
పద్మ విభూషణ్ అవార్డులు( Padma Vibhushan Awards ) వరించిన డాక్టర్ డి నాగేశ్వరరెడ్డి అలాగే పద్మ భూషణ్ పురస్కార గ్రహీతలను అభినందిస్తూనే రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించిన లబ్ధి ప్రతిష్టలను విస్మరించడానికి సీఎం రేవంత్ రెడ్డి తప్పు పట్టారు.తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గద్దర్‌కు పద్మ విభూషణ్, అలాగే చుక్కా రామయ్య, అందెశ్రీలకు పద్మ భూషణ్, గోరటి వెంకన్న, జయధీర్ తిరుమలరావులకు పద్మశ్రీ పురస్కారాలు ఇవ్వాలని రేవంత్ రెడ్డి సర్కార్ ప్రతి పాదనలు పంపింది.

కానీ వీళ్లలో ఏ ఒక్కరినీ కేంద్ర ప్రభుత్వం పరిగణలోకి తీసుకోకపోవడాన్ని సీఎం రేవంత్ రెడ్డి సీరియస్ గా తీసుకున్నారు.డాక్టర్ నాగేశ్వరరెడ్డికి( Dr Nageshwar Reddy ) పద్మ విభూషణ్ అవార్డు ఇవ్వడంపై ఎవరికీ అభ్యంతరం లేదు.ఇదే సందర్భంలో తెలంగాణ సర్కార్ పంపిన జాబితాలోని పేర్లను పరిశీలిస్తే అన్ని రకాలుగా అర్హులే.తెలంగాణలో కాంగ్రెస్ పాలన సాగిస్తుండడంతో పరిగణలోకి తీసుకోలేదనే అభిప్రాయం కలుగుతోంది.అలాగే గద్దర్( Gaddar ) ప్రజా గాయకుడిగా తెలుగు సమాజంలో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు.

అనారోగ్యంతో ఆయన ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే.అలాగే రేవంత్‌రెడ్డి సర్కార్ పంపిన పేర్లలో గోరటి వెంకన్న( Goreti Venkanna ) వుండడం విశేషం.ఈయన బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్సీగా ప్రాతినిథ్యం వహిస్తున్నారు.
తెలంగాణ రాష్ట్ర గీతాన్ని రాసి, ఆలపించిన ఖ్యాతి అందెశ్రీది.చుక్కా రామయ్య( Chukka Ramaiah ) ఎంత గొప్ప విద్యావేత్తో అందరికీ తెలుసు.
అలాగే జయధీర్ తిరుమలరావు( Jayadheer Tirumala Rao ) ఆర్టిస్ట్‌గా, సాహితీకారుడిగా ప్రసిద్ధుడు.మరెందుకు కేంద్ర ప్రభుత్వం పరిగణలోకి తీసుకోలేదన్నది ప్రశ్నే.
నిలదీయాల్సిన అంశమే.అలాగే కేంద్ర ప్రభుత్వం సమాధానం చెప్పాల్సిన అవసరం వుంది.
అయితే బాలయ్య బాబుకు పద్మ భూషణ్ అవార్డు వరించిన విషయం తెలిసిందే.ఈ విషయం పట్ల కూడా స్పందిస్తూ బాలయ్య బాబుకు( Balayya Babu ) రావడం మంచి విషయమే, కానీ మిగతా వారికి ఎందుకు రాలేదు అని ఆయన ప్రశ్నించారు.