1.కోలుకున్న కేటీఆర్

ఇటీవల కరోనా వైరస్ ప్రభావానికి గురైన టిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ తెలంగాణ మంత్రి కేటీఆర్ కోలుకున్నారు.
2.రాజగోపాల్ రెడ్డి కామెంట్స్
తెలంగాణ ప్రజల ఆత్మగౌరవం కోసమే మునుగోడు ఉప ఎన్నిక జరగబోతోంది అని, తనకు వ్యతిరేకంగా ప్రజలను ఒప్పించడం వారి తరం కాదంటూ టిఆర్ఎస్ నేతలను ఉద్దేశించి రాజగోపాల్ రెడ్డి కామెంట్ చేశారు.
3.స్టేషన్ ఘన్ పూర్ లో మంత్రి తలసాని పర్యటన

స్టేషన్గన్పూర్ లో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పర్యటించారు.
4.నాగార్జునసాగర్ ప్రాజెక్టుకు తగ్గుతున్న వరద
నాగార్జునసాగర్ ప్రాజెక్టుకు వరద ప్రవాహం తగ్గుముఖం పట్టింది.అధికారులు ప్రాజెక్టుకు ఉన్న ఎనిమిది గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేశారు.
5.సెప్టెంబర్ 17న విద్రోహ దినంగా జరపండి

సెప్టెంబర్ 17 తెలంగాణ ప్రజలకు విద్రోహం జరిగిన రోజు అని, ఈరోజు ను విద్రోహ దినంగా జరపాలని సిపిఐ ప్రజాపంథ పార్టీ రాష్ట్ర ప్రజలకు పిలుపునిచ్చింది.
6.ఫార్మసిటీ రద్దు పై సుప్రీం కు వెళ్తాం
రంగారెడ్డి జిల్లా యాచారం కందుకూరు మండలాల్లో ఏర్పాటు చేస్తున్న ఫార్మసిటీ రద్దుకు సుప్రీంకోర్టు ను ఆశ్రయిస్తామని అఖిలపక్ష నాయకులు అన్నారు.
7.షర్మిల కామెంట్స్

తెలంగాణలో రాజన్న పాలన తీసుకొస్తానని తన పార్టీకి ప్రజలు సహకరించాలని వైయస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షులు షర్మిల అన్నారు.
8.బండి సంజయ్ పాదయాత్ర
తెలంగాణ బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ చేపట్టనున్న ప్రజా సంగ్రామ యాత్ర సెప్టెంబర్ 12 నుంచి ప్రారంభం కానుంది.
9.మునుగోడు వరకే టీఆర్ఎస్ తో పొత్తు

మునుగోడు ఉప ఎన్నికల వరకే టీఆర్ఎస్ పార్టీతో పొత్తు కొనసాగిస్తామని సిపిఎం తెలంగాణ కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు.
10.కాంగ్రెస్ సభకు భారీగా తెలంగాణ శ్రేణులు
దేశ రాజధాని ఢిల్లీలో కాంగ్రెస్ నిర్వహించిన బహిరంగ సభకు తెలంగాణ కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు భారీగా తరలి వచ్చారు.
11.సింగరేణి జూనియర్ అసిస్టెంట్ రాత పరీక్ష

సింగరేణి జూనియర్ అసిస్టెంట్ రాత పరీక్ష ప్రశాంతంగా ముగిసింది.రాష్ట్రంలోని ఎనిమిది జిల్లాల్లో ఏర్పాటు చేసిన 187 పరీక్ష కేంద్రాల్లో మొత్తం 77,907 మంది అభ్యర్థులు పరీక్ష రాశారు.
12.ఏడు నుంచి ట్రిపుల్ ఐటీ రెండో విడత కౌన్సెలింగ్
నిర్మల్ జిల్లా బాసర ఆర్జీయూకేటీ ట్రిపుల్ ఐటీ లో బుధవారం నుంచి రెండో విడత కౌన్సెలింగ్ నిర్వహిస్తున్నట్టు వైస్ ఛాన్సలర్ తెలిపారు.
13.సిట్టింగులకే సీట్లు ఇస్తే మునగడం ఖాయం

రాబోయే ఎన్నికల్లో సిట్టింగ్ ఎమ్మెల్యే లకే సీట్లు ఇస్తే పార్టీ మునగడం ఖాయమని తెలంగాణ రాష్ట్ర బీసీ సంఘం అధ్యక్షుడు శ్రీనివాస్ గౌడ్ పేర్కొన్నారు.
16.బీసీ గురుకుల ఉపాధ్యాయులకు అవార్డులు
బీసీ గురుకులాలకు చెందిన 11 మంది లెక్చరర్లు టీచర్లు ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులకు ఎంపికైనట్లు బీసీ గురుకుల సొసైటీ కార్యదర్శి తెలిపారు.
17.హైదరాబాద్ లో ఎన్ఐఏ సోదాలు

హైదరాబాద్ లో ఎమ్మెల్యే అధికారులు జరిపిన సోదాలు ముగిసాయి.చైతన్య మహిళా సంఘం కన్వీనర్ జ్యోతి ఇంట్లో అధికారులు సోదాలు జరిపారు.
18.శ్రీ లక్ష్మీనరసింహస్వామి పవిత్రోత్సవాలు
గుంటూరులో నేటి నుంచి మూడు రోజులపాటు మంగళగిరి శ్రీ లక్ష్మీనరసింహస్వామి పవిత్ర ఉత్సవాలు జరుగుతున్నాయి.
19.కాకినాడ కు జీవీఎల్

బిజెపి రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు ఈరోజు కాకినాడ రానున్నారు పార్టీ సమావేశంలో పాల్గొననున్నారు.
20.జాబ్ మేళా
విజయవాడ ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీలో రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో జాబ్ మేళా ఏర్పాటు చేశారు.
.






