మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్( Ram Charan ) ఇటీవల గేమ్ చేంజర్( Game Changer ) సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు.అయితే ఈ సినిమా మాత్రం అనుకున్న స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది.
ఈ క్రమంలోనే తన తదుపరి సినిమాలపై ఫోకస్ పెడుతూ షూటింగ్ పనులలో ఎంతో బిజీగా ఉన్నారు ప్రస్తుతం రామ్ చరణ్ ఉప్పెన దర్శకుడు బుచ్చిబాబు( Bucchi Babu ) దర్శకత్వంలో సినిమా చేస్తున్న విషయం మనకు తెలిసిందే.ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ పనులను జరుపుకుంటుంది స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో ఈ సినిమా రాబోతుందని తెలుస్తోంది.

ఇక ఈ సినిమాలో రామ్ చరణ్ సరసన జాన్వీ కపూర్( Janhvi Kapoor ) నటించబోతున్నారు.ఇక ఈ సినిమాకు ప్రముఖ సంగీత దర్శకుడు ఆస్కార్ అవార్డు విజేత ఏఆర్ రెహమాన్( AR Rahman ) సంగీతం అందిస్తున్నారు.అయితే గత కొద్దిరోజులుగా రెహమాన్ గురించి ఒక వార్త వైరల్ అవుతుంది.ఈ సినిమా కోసం ఇప్పటికే కొన్ని ట్యూన్స్ రెహమాన్ సిద్ధం చేశారని అయితే కొన్ని కారణాలవల్ల ఆయన ఈ సినిమా నుంచి తప్పుకున్నారు అంటూ వార్తలు వస్తున్నాయి.
ఈ సినిమా కథ తనకు ఎంతగానో నచ్చిందని అందుకే ఈ సినిమాకు కమిట్ అయ్యానని గతంలో రెహమాన్ తెలిపారు.

ఇలా ఈ సినిమా కోసం కొన్ని ట్యూన్స్ కూడా సిద్ధం చేసి తన వ్యక్తిగత కారణాలవల్ల ఈయన సినిమా నుంచి తప్పుకున్నారని విషయం తెలిసిన మెగా అభిమానులు ఎంతో నిరాశ వ్యక్తం చేస్తున్నారు.మరి రెహమాన్ గురించి వస్తున్నటువంటి వార్తలలో ఎంతవరకు నిజం ఉందనేది కూడా తెలియదు.ఇలాంటి తరుణంలోని మేకర్ స్పందించాల్సిన అవసరం ఉందని అభిమానులు భావించారు ఈ క్రమంలోనే రెహమాన్ తప్పుకున్నారు అంటూ వస్తున్న వార్తలపై మైత్రి మూవీ వారు స్పందిస్తూ ఈ వార్తలు పూర్తిగా అవాస్తవమని కొట్టి పారేశారు.
ఈ సినిమా కోసం రెహమాన్ ఇప్పటికే పాటల ట్యూన్ కూడా ఇచ్చారంటూ మేకర్స్ క్లారిటీ ఇవ్వడంతో ఈ వార్తలకు చెక్ పెట్టినట్లు అయింది.







