శరీరానికి కావాల్సిన అతి ముఖ్యమైన విటమిన్స్‌లో కె విటమిన్ ఒకటి.ఏవైనా గాయాలైనప్పుడు అధిక రక్తశ్రావము అవ్వకుండా ఉండాలన్నా.
ఎముకలు, కండరాలు బలంగా మారాలన్నా శరీరంలో క్యాన్సర్ కణాలు వృద్ధి చెందకుండా చేయాలన్న.గుండె పని తీరు మెరుగుపడాలన్నా విటమిన్ కె ఎంతో అవసరం.
అందుకే విటమిన్ కె లోపం ఏర్పడకుండా చూసుకోవాలి.అయితే ఎవరైనా ఒకవేళ విటమిన్ కె లోపంతో బాధ పడుతుంటే అలాంటి వారు ఖచ్చితంగా కొన్ని ఫుడ్స్‌ను డైట్‌లో చేర్చుకోవాల్సి ఉంటుంది.
ఆ ఫుడ్స్ ఏంటో లేట్ చేయకుండా ఓ లుక్కేసేయండి.
విటమిన్ కె పుష్కలంగా ఉండే ఆహారాల్లో క్యాబేజ్ ఒకటి.
క్యాబేజ్‌ను తీసుకోవడం వల్ల శరీరానికి విటమిన్ కె మాత్రమే కాకుండా విటమిన్ బి, విటమిన్ సి మరియు ఎన్నో రకాల మినరల్స్ కూడా అందుతాయి.పాల కూర, మెంతి కూర, బచ్చలి కూర, తోట కూర, గోంగూర వంటి ఆకుపచ్చని రంగులో ఉండే ఆకుకూరల్లో విటమిన్ కె సమృద్ధిగా లభిస్తుంది.
అలాగే కివి పండులో కూడా విటమిన్ కె ఉంటుంది.అందువల్ల, ప్రతి రోజు ఒక కివి పండు తీసుకుంటే విటమిన్ కె లోపం దరి చేరకుండా ఉంటుంది.కివి పండ్లు అందుబాటులో లేకుంటే దానిమ్మ, అవకాడో పండ్లు కూడా తీసుకోవచ్చు.వీటి ద్వారా కూడా విటమిన్ కె పొందొచ్చు.
విటమిన్ కె అత్యధికంగా ఉండే ఆహారాల్లో పచ్చి బఠానీలు కూడా ఉన్నాయి.డైలీ డైట్‌లో పచ్చి బఠానీలు తీసుకోవడం వల్ల విటమిన్ కె లోపం దూరం అవ్వడంతో పాటు శరీరానికి ఎన్నో పోషకాలు కూడా అందుతాయి.
ఇక బెండ కాయలు, ఉల్లికాడలు, కీర, నట్స్ వంటి వాటిలో కూడా విటమిన్ కె అధికంగా ఉంటుంది.కాబట్టి, వీటిని ఆహారంలో చేర్చుకోవడం మంచిది.