వామ్మో.. అక్కడ ప్రతి ఒక్క మహిళకి ఆరు అడుగులపైనే జుట్టు.. ఎందుకంటే?

ప్రస్తుత రోజులలో ఆడవారైనా, మగవారైనా కానీ పొడవాటి జుట్టు పెంచుకోవడం అంటే ఇస్తా పడతారు.అంతేకాకుండా, ప్రస్తుతం అమ్మాయిలకు పొట్టి జుట్టు ఫ్యాషన్ గా ట్రెండ్ గా మారింది.

 Because Every Single Woman Out There Has Six Feet Of Hair , Chinese, Viral Lates-TeluguStop.com

అదే అబ్బాయిలలో మాత్రం పొడువాటి జుట్టు ఫ్యాషన్ ట్రెండ్ గా నడుస్తుంది.సాధారణంగా పొడువాటి జుట్టు, మందపు జుట్టు కోసం అనేక జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది.

కానీ, అక్కడ మాత్రం ప్రతి ఒక్క స్త్రీ జుట్టు మాత్రం 6 నుంచి 7 అడుగుల పొడవు కచ్చితంగా ఉంటుంది.వాస్తవానికి అక్కడ ఉన్నవారు మహిళలు అందరూ వారి జీవితంలో ఒక్కసారి మాత్రమే జుట్టు కత్తిరించుకుంటారట.

ఇలా ఒక్కసారే కత్తిరించుకోవడానికి అనేక కారణాలే ఉన్నాయి.ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు లోకి వెళ్తే.

చైనా దక్షిణ భాగంలో గుయిలిన్ ( Guilin )అనే నగరం దగ్గరగా హువాంగ్లూ ( Huanglu )అనే గ్రామం ఉంది.కానీ, ఇక్కడ ఆడవాళ్లను చూస్తే అందరూ ఒక్కసారిగా ఆశ్చర్యానికి లోనవుతారు.అందుకు గల కారణం వారి జుట్టు ఎత్తు.ఆ గ్రామంలో నివసించే ప్రతి మహిళకు ఆరు అడుగుల కంటే ఎక్కువగా జుట్టు పొడుగు ఉండడం సర్వసాధారణం.అంతేకాకుండా చాలా వరకు మహిళలకు 6 నుంచి 7 అడుగుల జుట్టూ కచ్చితంగా ఉంటుంది.

ఇలా ప్రతి ఒక్కరి జుట్టు పెరగడానికి గల ముఖ్య కారణం ఏమిటి అంటే వారి పూర్వీకుల గౌరవార్థం వారి జుట్టును అలా పెంచుకుంటారట.జుట్టు పూర్వికులతో కమ్యూనికేషన్ మాధ్యమం అని అక్కడి ప్రజల నమ్మకం అట.అందుకే పూర్వికులను సంతోష పెట్టడానికి కోసం వారు ఎప్పుడూ కూడా జుట్టును కత్తిరించుకోరు.అంతే కాకుండా వివాహం కాని స్త్రీలు వారి జుట్టును స్కార్ఫ్‌తో కట్టుకుంటారు.పెళ్లైన మహిళలు తమ జుట్టును ముందు భాగంలో కట్టుకుంటారు.ఇక అక్కడి ప్రాంత మహిళలు పర్యాటకులను ఎంతగానో ఆకట్టుకుంటున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube