వామ్మో.. అక్కడ ప్రతి ఒక్క మహిళకి ఆరు అడుగులపైనే జుట్టు.. ఎందుకంటే?
TeluguStop.com
ప్రస్తుత రోజులలో ఆడవారైనా, మగవారైనా కానీ పొడవాటి జుట్టు పెంచుకోవడం అంటే ఇస్తా పడతారు.
అంతేకాకుండా, ప్రస్తుతం అమ్మాయిలకు పొట్టి జుట్టు ఫ్యాషన్ గా ట్రెండ్ గా మారింది.
అదే అబ్బాయిలలో మాత్రం పొడువాటి జుట్టు ఫ్యాషన్ ట్రెండ్ గా నడుస్తుంది.సాధారణంగా పొడువాటి జుట్టు, మందపు జుట్టు కోసం అనేక జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది.
కానీ, అక్కడ మాత్రం ప్రతి ఒక్క స్త్రీ జుట్టు మాత్రం 6 నుంచి 7 అడుగుల పొడవు కచ్చితంగా ఉంటుంది.
వాస్తవానికి అక్కడ ఉన్నవారు మహిళలు అందరూ వారి జీవితంలో ఒక్కసారి మాత్రమే జుట్టు కత్తిరించుకుంటారట.
ఇలా ఒక్కసారే కత్తిరించుకోవడానికి అనేక కారణాలే ఉన్నాయి.ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు లోకి వెళ్తే.
"""/" /
చైనా దక్షిణ భాగంలో గుయిలిన్ ( Guilin )అనే నగరం దగ్గరగా హువాంగ్లూ ( Huanglu )అనే గ్రామం ఉంది.
కానీ, ఇక్కడ ఆడవాళ్లను చూస్తే అందరూ ఒక్కసారిగా ఆశ్చర్యానికి లోనవుతారు.అందుకు గల కారణం వారి జుట్టు ఎత్తు.
ఆ గ్రామంలో నివసించే ప్రతి మహిళకు ఆరు అడుగుల కంటే ఎక్కువగా జుట్టు పొడుగు ఉండడం సర్వసాధారణం.
అంతేకాకుండా చాలా వరకు మహిళలకు 6 నుంచి 7 అడుగుల జుట్టూ కచ్చితంగా ఉంటుంది.
"""/" / ఇలా ప్రతి ఒక్కరి జుట్టు పెరగడానికి గల ముఖ్య కారణం ఏమిటి అంటే వారి పూర్వీకుల గౌరవార్థం వారి జుట్టును అలా పెంచుకుంటారట.
జుట్టు పూర్వికులతో కమ్యూనికేషన్ మాధ్యమం అని అక్కడి ప్రజల నమ్మకం అట.అందుకే పూర్వికులను సంతోష పెట్టడానికి కోసం వారు ఎప్పుడూ కూడా జుట్టును కత్తిరించుకోరు.
అంతే కాకుండా వివాహం కాని స్త్రీలు వారి జుట్టును స్కార్ఫ్‌తో కట్టుకుంటారు.పెళ్లైన మహిళలు తమ జుట్టును ముందు భాగంలో కట్టుకుంటారు.
ఇక అక్కడి ప్రాంత మహిళలు పర్యాటకులను ఎంతగానో ఆకట్టుకుంటున్నారు.
అల్లు అర్జున్ బాబీ డైరెక్షన్ లో సినిమా చేయబోతున్నాడా..?