ట్రంప్‌కు సిలికాన్ వ్యాలీ సపోర్ట్.. వాళ్లతో కలిసి పనిచేస్తా : భారత సంతతి క్యాపిటలిస్ట్

అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్( Donald Trump ) విజయం సాధించడంతో అమెరికాలో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయోనని జనం బిక్కుబిక్కుంటున్నారు.మరి ముఖ్యంగా కార్పోరేట్ ప్రపంచం కూడా ఆయన నిర్ణయాలపై ఆసక్తిగా ఉంది.

 I Am Very Excited To Work For Bring Back An Innovation-friendly Regulatory Syste-TeluguStop.com

ప్రపంచంలోనే అతిపెద్ద టెక్ జోన్‌లలో ఒకటైన సిలికాన్ వ్యాలీలో( Silicon Valley ) భారత సంతతికి చెందిన ఆశా జడేజా మోత్వాని( Asha Jadeja Motwani ) అనే వెంచర్ క్యాపిటలిస్ట్ ట్రంప్‌పై కీలక వ్యాఖ్యలు చేశారు.

సిలికాన్ వ్యాలీ ఇప్పుడు చాలా సమస్యలలో మునిగిపోయిందని మోత్వాని ఆవేదన వ్యక్తం చేశారు.

ఇన్నోవేషన్ ఫ్రెండ్లీ రెగ్యులేటరీ సిస్టమ్‌ను( Innovation-Friendly Regulatory System ) తిరిగి తీసుకురావడంలో నా తోటి వెంచర్ క్యాపిటలిస్ట్స్ డేవిడ్ సాక్స్, చమత్, శ్రీరామ్ కృష్ణన్‌లతో కలిసి పనిచేసేందుకు తాను చాలా ఉత్సాహంగా ఉన్నానని ఆమె చెప్పారు.టెక్ ఇండస్ట్రీ చాలా కాలంగా లీనా ఖాన్ వంటి సిద్ధాంతకర్తలతో వేధింపులకు గురైందని మోత్వాని అన్నారు.

శత్రు ప్రపంచంలో అమెరికన్ టెక్నాలజీ నాయకత్వానికి సంబంధించి వ్యూహాత్మక ప్రాముఖ్యతను అర్ధం చేసుకున్న వ్యక్తిని ఆమె స్థానంలో తీసుకుంటే మంచిదని మోత్వాని ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు.

Telugu Ashajadeja, Chamath, David, Donald Trump, Indian Startups, Silicon Valley

సిలికాన్ వ్యాలీలో ట్రంప్ తొలి మద్ధతుదారులలో మోత్వానీ ఒకరు.గత కొన్నేళ్లుగా భారతీయ స్టార్టప్‌లకు( Indian Startups ) ఆమె పెద్ద మద్ధతుదారుగా నిలిచారు.లాస్ వెగాస్‌లో జనవరి 7 నుంచి 11 వరకు జరగనున్న కన్జ్యూమర్ ఎలక్ట్రానిక్స్ షో (సీఈఎస్) 2025లో మోత్వాని జడేజా ఫౌండేషన్.

ఇండియా పెవిలియన్‌ను నిర్వహిస్తోంది.ఏళ్లుగా ఈ ఫౌండేషన్ ఈ ప్రతిష్టాత్మక ఫ్లాట్‌ఫాంలో భారతదేశ ఉనికిని పెంపొందించడానికి నిలకడగా పనిచేసింది.

Telugu Ashajadeja, Chamath, David, Donald Trump, Indian Startups, Silicon Valley

గూగుల్‌కు తొలినాళ్లలో పెట్టుబడిదారుగా వ్యవహరించిన మోత్వాని.దాదాపు 100కు పైగా స్టార్టప్‌లలో పెట్టుబడి పెట్టారు.భారత్‌లోని ప్రస్తుత స్టార్టప్ ఎకోసిస్టమ్‌పై నమ్మకం ఉంచారు.తన భర్త దివంగత రాజీవ్ మోత్వాని .గూగుల్‌కు అల్గారిథమ్‌లను రూపొందించారు.గూగుల్ వ్యవస్థాపకులు లారీ పేజ్, సెర్గీ బ్రిన్‌లకు రాజీవ్ మెంటార్‌గా ఉన్నారు.

అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్ . సిలికాన్ వ్యాలీకి చెందిన పలువురు వ్యక్తులకు కీలక బాధ్యతలు అప్పగించారు.వైట్‌హౌస్ ఏఐ అండ్ క్రిప్టో జార్‌గా డేవిడ్ సాక్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌కు సీనియర్ పాలసీ అడ్వైజర్‌గా భారత సంతతికి చెందిన శ్రీరామ్ కృష్ణన్‌‌ను నియమించిన సంగతి తెలిసిందే.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube