తెలుగు సినీ ఇండస్ట్రీలో నటుడుగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న వారిలో నందమూరి నట సింహం బాలకృష్ణ ( Balakrishna ) ఒకరు.ఎన్టీఆర్ వారసత్వాన్ని కొనసాగిస్తూ ఈయన హీరోగా ఇండస్ట్రీలో మంచి సక్సెస్ అందుకున్నారు.
అదేవిధంగా రాజకీయాలలో కూడా ఈయన రాణిస్తూ తండ్రికి తగ్గ తనయుడు అనే పేరు సంపాదించుకున్నారు.ఇకపోతే త్వరలోనే బాలకృష్ణ డాకు మహారాజ్( Daku Maharaj ) అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు.
సంక్రాంతి పండుగను పురస్కరించుకొని జనవరి 12వ తేదీ ఈ సినిమా విడుదలకు సిద్ధమైంది.
ఇక ఈ సినిమా విడుదల కాబోతున్న నేపథ్యంలో ప్రమోషన్ కార్యక్రమాలను కూడా చిత్ర బృందం వేగవంతం చేశారు.ఈ క్రమంలోనే ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా బాలకృష్ణ హోస్టుగా వ్యవహరిస్తున్న అన్ స్టాపబుల్ ( Un stoppable ) కార్యక్రమానికి డైరెక్టర్ బాబితో పాటు నిర్మాత నాగ వంశీ మ్యూజిక్ డైరెక్టర్ తమన్ హాజరయ్యారు.త్వరలోనే ఈ ఎపిసోడ్ ప్రసారం కాబోతుంది అయితే ఈ కార్యక్రమానికి సంబంధించిన ప్రోమో విడుదల చేశారు ఇందులో భాగంగా మ్యూజిక్ డైరెక్టర్ తమన్ బాలకృష్ణను తన ఇద్దరి కూతుర్ల గురించి ప్రశ్నించారు.
మీ ఇద్దరి కూతుర్లలో మీరు ఎవరిని గారాబంగా పెంచారని ప్రశ్న వేయగా తన ఇద్దరి కూతుర్లను చాలా గారాబంగా పెంచానని తెలిపారు.ఇక ఎందుకు వీరిద్దరూ హీరోయిన్స్ గా ఇండస్ట్రీలోకి రాలేదు అనే ప్రశ్న కూడా ఎదురైంది.ఈ ప్రశ్నకు బాలకృష్ణ సమాధానం చెబుతూ తన పెద్ద కూతురు బ్రాహ్మణికి ( Bramhini ) స్టార్ డైరెక్టర్ మణిరత్నం దర్శకత్వంలో ఓ సినిమా అవకాశం వచ్చింది అయితే ఇదే విషయం తనకు చెప్పగా మై ఫేస్ అంటూ సమాధానం ఇచ్చింది అవును నీ ఫేస్ కోసమే ఛాన్స్ ఇచ్చారు అని చెప్పడంతో నాకు ఆసక్తి లేదని రిజెక్ట్ చేసినట్లు తెలిపారు.ఇక చిన్నమ్మాయి తేజస్విని మాత్రం అద్దంలో చూసుకుంటూ యాక్ట్ చేసేది ఆమె హీరోయిన్ అవుతుందనుకున్నాను ఆమె కూడా కాలేదు.
కానీ వారిద్దరూ వారికి ఇష్టమైన రంగంలో ఎంతో మంచి సక్సెస్ అందుకున్నారు.తండ్రిగా నాకెంతో గర్వంగా ఉందని బాలయ్య తన ఇద్దరి కూతుర్ల గురించి చెబుతూ మురిసిపోయారు.