మనలో చాలా మంది న్యూ ఇయర్ సందర్భంగా అనేక పోస్టులు, వీడియోలను మనం చాలానే చూసాము.అందులో కొంతమంది అందమైన ఫోటోలు దిగుతూ ఫ్యాషన్ దుస్తులతో ఫోటోలను షేర్ చేసారు.
ఇది ఇలా ఉండగా.ఇండియన్ ఆర్మీ షేర్ చేసిన ఓ వీడియో మాత్రం అందరిని కలిచి వేసింది.
నిజానికి ఆర్మీ షేర్ ( Army )చేసినా ఈ వీడియోను చూస్తే వారికి సెల్యూట్ కొట్టకుండా ఉండలేము.మనం ఇంట్లో చలికి వణుకుతూ కాస్త చల్లగా అయిన అన్నం తినాలి అంటే మనకి ముద్దా నోటిలోకి పోదు.
అలాంటిది మోకాల్లు చీల్చే చలిలో ఆర్మీ వారు వారి వృత్తి కోసం, భారతదేశం కోసం వారు పడే కష్టం చూస్తే కన్నీరు రావడం మాత్రం కచ్చితం.
సాధారణంగా ప్రస్తుతం జమ్మూ కాశ్మీర్, లడఖ్ ( Jammu Kashmir, Ladakh )లాంటి ప్రాంతాలలో తీవ్రమైన చలి వాతావరణ ఉంటుంది.సామన్య ప్రజలు ఇంట్లో ఉండి రక్షణ తీసుకుంటే సైనికులు మాత్రం బార్డర్ లో గస్తీ కాస్తున్నారు.ఇక ఆర్మీ వారు షేర్ చేసిన ఈ వీడియోలో తమ సైనికులు విధిలో స్థిరంగా ఉన్నారని భారత సైన్యం బుధవారం సైనికులు చేసిన అద్భుతమైన త్యాగాల గురించి తెలియజేస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ చేసారు.
సోషల్ మీడియాలో ఆర్మీ వారు పోస్ట్ చేస్తూ.కొత్త సంవత్సరం సందర్బంగా మన సైనికులు, ముఖ్యంగా జమ్మూ & కాశ్మీర్‌లోని నియంత్రణ రేఖ (ఎల్‌ఓసి) వద్ద కాపలాగా ఉన్నవారు చేసిన అద్భుతమైన త్యాగాలను ప్రతిబింబించడానికి కొంత సమయం కేటాయించడం చాలా ముఖ్యం అని తెలియచేసారు.అలాగే రాజస్థాన్‌లో వేసవిలో వేడి నుంచి లడఖ్, J&K, హిమాచల్, అరుణాచల్ ప్రదేశ్, సిక్కింలలో చలికాలంలో ఎముకలు కొరికే చలి వరకు వారి విధి నిర్వహణలో స్థిరంగా ఉంటారని తెలియచేసారు.ఈ వీడియో చుసిన ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది( Army Chief General Upendra Dwivedi ) డెహ్రాడూన్‌కు వెళ్లారు.
ఈ సందర్భంగా ఆయన కార్యాచరణ సంసిద్ధతను సమీక్షా నిర్వహించారు.అలాగే అక్కడే ఉండే భద్రత దళాలతో సంభాషించారు.ఈ ప్రాంతంలో కొనసాగుతున్న భద్రతా కార్యక్రమాలు, మౌలిక సదుపాయాల అభివృద్ధిపై కొంతమంది ఉన్నతాధికారుల నుంచి “సమగ్ర బ్రీఫింగ్‌లు” అందుకున్నారని సమాచారం.వీడియో చుసిన నెటిజన్స్ వివిధ రకాలుగా కామెంట్స్ చేస్తూ ఉన్నారు.