భార్యంటే పిచ్చి ప్రేమట.. సొంతంగా వాసెక్టమీ చేసుకున్నాడు... వీడియో చూస్తే షాక్ తింటారు!

తైవాన్( Taiwan ) రాజధాని తైపేకి చెందిన డాక్టర్ చెన్ వెయ్-నాంగ్( Dr Chen Wei-nong ) అనే సర్జన్ ఎవరూ ఊహించని ఓ సాహసం చేశారు.ఆయన భార్య ఇకపై గర్భం దాల్చకూడదని భావించిందట.

 Taiwan Doctor Carries Out His Own Vasectomy Calls It A Gift For His Wife Video V-TeluguStop.com

ఆమె కోరికను నెరవేర్చడానికి అతడే స్వయంగా వాసెక్టమీ( Vasectomy ) ఆపరేషన్ చేసుకుని అందరినీ ఆశ్చర్యపరిచారు.ఈ ఘటనకు సంబంధించిన వీడియోను ఆయన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేయడంతో అది వెంటనే వైరల్ అయిపోయింది.

ఆ వీడియోకు ఏకంగా 20 లక్షల వ్యూస్‌, 61 వేల లైక్స్‌ వచ్చాయి.11 నిమిషాల వీడియోలో డాక్టర్ చెన్, వాసెక్టమీ విధానాన్ని ఒక్కో మెట్టు వివరిస్తూ ఆపరేషన్ చేసుకున్నారు.ఈ ప్రక్రియపై అవగాహన కల్పించాలనేది ఆయన ఉద్దేశమట.వేరే డాక్టర్ చేస్తే పొరపాట్లు జరిగే అవకాశం ఉందని, తన నైపుణ్యంపై నమ్మకంతోనే సొంతంగా ఆపరేషన్ చేసుకున్నానని డాక్టర్ చెన్ తెలిపారు.

సాధారణంగా 15 నిమిషాల్లో పూర్తయ్యే ఈ ఆపరేషన్‌ను ఆయన సొంతంగా చేసుకోవడంతో గంట పట్టింది.

ఆపరేషన్ సమయంలో నొప్పిగా ఉందని ఆయన స్వయంగా చెప్పారు.“వాస్ డిఫరెన్స్‌ను తాకినప్పుడు చాలా నొప్పిగా ఉంది.నా శరీరాన్ని నేను కుట్టుకోవడం వింతగా ఉంది” అని ఆయన అన్నారు.

నొప్పిని భరిస్తూనే అతడు ఆపరేషన్‌ను విజయవంతంగా పూర్తిచేశారు.

మర్నాడు ఉదయం డాక్టర్ చెన్ తన ఫాలోవర్లకు అప్‌డేట్ ఇచ్చారు.ఆపరేషన్ తర్వాత తాను బాగానే ఉన్నానని చెప్పారు.ఆయన తీసుకున్న ఈ సాహసోపేత నిర్ణయం అందర్నీ నోరెళ్లబెట్టేలా చేశాయి, అలాగే ఈ డాక్టర్ నైపుణ్యం అందరినీ ఫిదా చేసింది.

కొందరికి ఆశ్చర్యం వేసినా, మరికొందరు సందేహించారు.

ఈ వీడియోపై నెటిజన్లు భిన్నంగా స్పందించారు.“వేరే డాక్టర్‌తో చేయించుకుంటే బాగుండేది కదా?” అని ఒకరు కామెంట్ చేయగా, “అనస్థీషియా ఉన్నా ఆ నొప్పిని ఊహించలేకపోతున్నా” అని మరొకరు రాశారు.అయితే, కొందరు మాత్రం హాస్యాన్ని జోడించారు.“ఖచ్చితత్వం కోసం ఇదే సరైన మార్గం” అని ఒక యూజర్ చమత్కరించారు.“భార్యంటే మరీ ఇంత పిచ్చా” అని ఇంకొకరు సరదాగా కామెంట్ పెట్టారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube