ఈ మధ్యకాలంలో చాలామంది ప్రజలలో మెడనొప్పి సమస్య ఎక్కువగా వేధిస్తుంది.ఈ మెడ నొప్పి ఉంటే పనులు సరిగ్గా చేయడానికి విలు కాదు.
ఆఫీస్ లో లేదా వర్క్ ఫ్రొం హోమ్ లో ఉన్నవారు గంటల తరబడి కూర్చొని లాప్టాప్ లేదా కంప్యూటర్ మీద పని చేయడం వల్ల మెడ నొప్పి ఎక్కువగా వస్తుంది.సాధారణంగా మనం కూర్చునే విధానం సరిగ్గా లేకుంటేనే మెడ నొప్పి వస్తుంది.
చిన్న సమస్య అని తేలిక తీసేస్తే సమస్య మరింత తీవ్రంగా పెరిగే అవకాశం ఉంది.
కంప్యూటర్ లేదా స్మార్ట్ ఫోన్ లను ఎక్కువసేపు ఉపయోగించేటప్పుడు అవి సరైన ఎత్తులో లేకుండా ఉంటే కండరాలపై ఒత్తిడి పెరుగుతుంది.
మంచం మీద పడుకుని లేదా కూర్చుని చదవడం వల్ల కూడా ఒత్తిడికి దారి తీసే అవకాశం ఉంది.ఇది మెడ నొప్పికి కారణం అవుతుంది.తలను అకస్మాత్తుగా వెనుకకు లేదా ముందుకు కదిలినప్పుడు నరాలు ఒత్తిడికి గురవడం వల్ల కూడా మెడ నొప్పి వస్తుంది.

అయితే కొన్ని చిట్కాలను అనుసరించడం వల్ల మెడ నొప్పిని తగ్గించుకోవచ్చు.అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.కూర్చున్నప్పుడు లేదా నిలబడినప్పుడు భుజాలు తుంటిపై సమానంగా ఉండేలా చూసుకోవాలి.
అలాగే మీ చెవులు నేరుగా మీ భుజాలకు సమకోణంలో ఉండేట్టు చూసుకోవాలి.స్మార్ట్ ఫోన్లు, టాబ్లెట్లు లేదా ఇతర చిన్న స్క్రీన్లు వంటి ఎలక్ట్రానిక్ ఉపకరణాలను ఉపయోగిస్తున్నప్పుడు మేడ వంచకూడదు.
ఇలా వంచకూడదు అంటే ఈ వస్తువులు మీ తలకు అనుగుణంగా కాస్త ఎత్తులో ఉండేలా చూసుకోవాలి.

మీ భుజాలు చేతులపై ఎక్కువగా బరువు ఉండే బ్యాక్ ప్యాక్లను మోయడం మంచిది కాదు.ఎందుకంటే ఇవి మీ భుజాలపై ఒత్తిడిని కలిగిస్తాయి.దాని వల్ల మెడ నొప్పి కూడా వచ్చే అవకాశం ఉంది.
అంతేకాకుండా స్ట్రెచింగ్ వ్యాయామాలు చేయడం కూడా మంచిదే.ఇంకా చెప్పాలంటే ఒకే చోట ఎక్కువసేపు అసలు కూర్చోకూడదు.
కనీసం 30 నుంచి 40 నిమిషాల లోపు లేచి ఒక ఐదు నిమిషాలు తిరిగి మళ్ళీ కూర్చోవచ్చు.