అడవిలో ఊహించని ఘోరం.. తండ్రీకొడుకులను చంపేసిన ఎలుగుబంటి.. షాకింగ్ వీడియో వైరల్!

శనివారం నాడు ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం,( Chhattisgarh ) కాంకేర్ జిల్లాలో( Kanker District ) ఓ భయంకర విషాదం చోటు చేసుకుంది.కొరార్ ఫారెస్ట్ రేంజ్‌( Korar Forest Range ) పరిధిలో ఉన్న డోంగర్‌కట్ట గ్రామం సమీపంలో ఓ పెద్ద ఎలుగుబంటి( Bear ) తండ్రీ కొడుకులపై దాడి చేసింది.

 Bear Attack In Chhattisgarh Father-son Duo Mauled To Death At Korar Forest Video-TeluguStop.com

ఆ దాడిలో వారిద్దరూ ప్రాణాలు కోల్పోయారు.మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు.

వివరాల్లోకి వెళితే.సుక్లాల్ దర్రో (45), అజ్జు కురేటి (22) అనే ఇద్దరు వ్యక్తులు జైల్‌కాసా కొండపై కట్టెలు ఏరుకునేందుకు వెళ్లారు.అక్కడ వారిపై ఓ మృత్యువులా ఓ ఎలుగుబంటి ఒక్కసారిగా విరుచుకుపడింది.ఈ దాడిలో సుక్లాల్ దారుణంగా అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు.

అజ్జు మాత్రం తీవ్ర గాయాలతో ప్రాణాల కోసం పోరాడాడు.సమాచారం అందుకున్న అటవీ, పోలీసు శాఖ అధికారులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకొని అజ్జును హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు.

అయితే స్థానికులు, అటవీ శాఖ అధికారులు( Forest Officers ) కలిసి సుక్లాల్ మృతదేహాన్ని అక్కడి నుంచి తరలిస్తుండగా.మళ్లీ అదే ఎలుగుబంటి భీకరంగా దాడి చేసింది.ఈసారి సుక్లాల్ తండ్రి అయిన శంకర్ ప్రాణాలు కోల్పోయాడు.ఇతరులను కాపాడేందుకు ప్రయత్నించిన నారాయణ్ యాదవ్ అనే ఫారెస్ట్ గార్డు కూడా తీవ్రంగా గాయపడ్డాడు.ఆ ఎలుగుబంటి అతడిని బలంగా గీరుతూ, కొరకడంతో అతడి చేతులకు తీవ్ర గాయాలయ్యాయి.ప్రస్తుతం ఆయన పరిస్థితి విషమంగా ఉంది.

ఈ దాడికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.ఆ వీడియోలో ఎలుగుబంటి ప్రజలపై, అటవీ శాఖ గార్డుపై దాడి చేస్తున్న దృశ్యాలు భయానకంగా అనిపించాయి.గార్డును ఎలుగుబంటి నేలకేసి ఒత్తుతూ కొరుకుతూ గాయపరిచింది, అది అతడు తప్పించుకోకుండా పట్టుకున్న తీరు చూస్తే ఒళ్లు గగుర్పొడుస్తుంది.

చివరికి అధికారులు జేసీబీ యంత్రాలను ఉపయోగించి సుక్లాల్, శంకర్ దర్రోల మృతదేహాలను అడవిలోంచి వెలికి తీశారు.

ఇప్పటికీ ఆ ఎలుగుబంటి మాత్రం పట్టుబడలేదు.

ప్రస్తుతం అటవీ శాఖ అధికారులు ఆ ప్రాంతంలోనే ఉండి ఎలుగుబంటి కదలికలను నిశితంగా గమనిస్తున్నారు.

పరిస్థితి అదుపులోకి వచ్చే వరకు గ్రామస్తులు అడవిలోకి వెళ్లవద్దని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.ఈ ఘటనతో స్థానిక ప్రజలు భయాందోళన చెందుతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube