సినిమా ఇండస్ట్రీలో ఇప్పటివరకు చాలామంది కమర్షియల్ డైరెక్టర్లు సూపర్ సక్సెస్ సాధిస్తూ ముందుకు సాగుతున్నారు.మరి ఇలాంటి క్రమంలోనే గోపి చంద్ మలినేని( Gopichand Malineni ) లాంటి దర్శకుడు సైతం ఇప్పుడు బాలీవుడ్ లో సన్నీ డియోల్ తో( Sunny Deol ) ఒక సినిమా చేస్తున్నాడు.
ఈ సినిమాతో ఎలాగైనా సరే సక్సెస్ ని సాధించి పాన్ ఇండియాలో భారీ మార్కెట్ ను కొల్లగొట్టాలనే ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలుస్తోంది.
మరి తను అనుకున్నట్టుగానే ఈ సినిమాతో సూపర్ సక్సెస్ సాధిస్తాడా తద్వారా తనకంటూ ఒక ఐడెంటిటిని తీసుకుంటాడా? లేదా అనేది తెలియాల్సి ఉంది.మరి ఏది ఏమైనా కూడా రవితేజతో( Ravi Teja ) చేయాల్సిన సినిమా క్యాన్సల్ అవ్వడంతో ఆయనకి బాలీవుడ్ స్టార్ హీరో అయిన సన్నీ డియోల్ తో సినిమా చేసే అవకాశమైతే వచ్చింది.మరి ఎలాగైనా సరే ఈ సినిమాతో తనేంటో పాన్ ఇండియా జనాలకు కూడా తెలుస్తుందనే ఒక నమ్మకం అయితే ఉన్నట్టుగా తెలుస్తోంది.
ఇక దానికి తగ్గట్టుగా ఇప్పుడు ఆయన బాలయ్య బాబుతో మరొక సినిమా చేయడానికి కూడా సన్నాహాలు చేసుకుంటున్నాడు.
మరి ఈ సినిమా తర్వాత తమిళ్ స్టార్ హీరో అయిన సూర్యతో( Suriya ) కూడా ఒక సబ్జెక్టుని డీల్ చేయబోతున్నట్టుగా తెలుస్తోంది.మరి ఇప్పుడు అందుతున్న సమాచారం ప్రకారం అయితే వీళ్ళ కాంబినేషన్ లో మైత్రి మూవీ మేకర్స్ వారే ఈ సినిమాను నిర్మించడానికి సిద్ధం అవుతున్నట్టుగా కూడా వార్తలైతే వస్తున్నాయి.మరి ఇందులో ఎంతవరకు నిజం ఉంది అనే విషయం తెలియాలంటే మరి కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే… చూడాలి మరి ఈయన కాంబినేషన్ లో వచ్చే సినిమా ఎలాంటి సక్సెస్ లను సాధిస్తుంది అనేది…
.