జుట్టు ఒత్తుగా ఉంటే ఎంత అందంగా కనబడుతుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.అయితే ఒత్తైన జుట్టు కావాలనుకుంటే మొదట హెయిర్ ఫాల్( Hair fall ) కు చెక్ పెట్టాలి.
హెయిర్ ఫాల్ కి చెక్ పెట్టాలంటే కుదుళ్లను దృఢంగా మార్చుకోవాలి.అయితే అందుకు ఇప్పుడు చెప్పబోయే హోమ్ మేడ్ హెయిర్ టోనర్ చాలా అద్భుతంగా సహాయపడుతుంది.
వారానికి ఒక్కసారి ఈ న్యాచురల్ టోనర్ ను వాడినా చాలు మీ జుట్టు దృఢంగా ఒత్తుగా పెరుగుతుంది.మరి ఇంతకీ ఆ టోనర్ ను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
ముందుగా మిక్సీ జార్ తీసుకొని అందులో రెండు రెబ్బలు కరివేపాకు, రెండు రెబ్బలు వేపాకు, రెండు టేబుల్ స్పూన్లు మెంతులు, వన్ టేబుల్ స్పూన్ లవంగాలు, ( Cloves )వన్ టేబుల్ స్పూన్ మిరియాలు వేసి మెత్తని పొడిలా గ్రైండ్ చేసుకోవాలి.ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకుని రెండు గ్లాసుల బియ్యం కడిగిన వాటర్ ను పోసుకోవాలి.

అలాగే గ్రైండ్ చేసి పెట్టుకున్న పొడిని అందులో వేసి కనీసం పదిహేను నిమిషాల పాటు ఉడికించాలి.ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని మరిగించిన వాటర్ ను ఫిల్టర్ చేసుకుని చల్లార బెట్టుకోవాలి.ఈ వాటర్ లో వన్ టేబుల్ స్పూన్ కోకోనట్ ఆయిల్( Coconut oil ) వేసి బాగా మిక్స్ చేస్తే మన టోనర్ సిద్ధం అవుతుంది.ఈ టోనర్ ను ఒక స్ప్రే బాటిల్ లో నింపుకొని జుట్టు కుదుళ్ల నుంచి చివర్ల వరకు ఒకటికి రెండుసార్లు స్ప్రే చేసుకోవాలి.

గంట అనంతరం మైల్డ్ షాంపూను ఉపయోగించి శుభ్రంగా తల స్నానం చేయాలి.వారానికి ఒక్కసారి ఈ విధంగా చేయడం వల్ల హెయిర్ రూట్స్ స్ట్రాంగ్ గా మారుతాయి.దాంతో జుట్టు రాలడం తగ్గుతుంది.అదే సమయంలో జుట్టు ఒత్తుగా పెరుగుతుంది. కాబట్టి దృఢమైన ఒత్తైన కురులను కోరుకునే వారు తప్పకుండా ఈ టోనర్ ను తయారు చేసుకుని వాడేందుకు ప్రయత్నించండి.మంచి రిజల్ట్ మీ సొంతం అవుతుంది.







