రోషన్ కనకాల( Roshan kanakala ) గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో ఎక్కువగా వినిపిస్తున్న పేర్లలో ఈ పేరు కూడా ఒకటి.టాలీవుడ్ స్టార్ యాంకర్ సుమ కనకాల కొడుకే రోషన్ అన్న విషయం తెలిసిందే.
బబుల్‌గమ్ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు హీరోగా పరిచయం కాబోతున్నాడు రోషన్.ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషన్స్ కార్యక్రమాలలో భాగంగా ఫుల్ బిజీబిజీగా గడుపుతున్నారు.
ఇప్పటికే అనేక రకాల షోలకు ఎంట్రీ ఇవ్వడంతో పాటు ఇంటర్వ్యూ ఇస్తూ ఫుల్ బిజీ బిజీగా గడుపుతున్నారు రోషన్.బబుల్‌గమ్ సినిమాకు రవికాంత్ పేరపు( Ravikanth Perepu ) దర్శకత్వం వహించిన విషయం తెలిసిందే.
ఈ మూవీ ఈ నెల 29న రిలీజ్ కాబోతుంది.

ఆదివారం సాయంత్రం హైదరాబాద్ ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు.ఈ కార్యక్రమానికి అడవి శేష్, సిద్దు జొన్నల గడ్డ వంటి వారు గెస్ట్ లుగా వచ్చారు.ఇందులో రోషన్ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.
ట్రోల్స్ పై ఆయన స్పందన ఆశ్చర్యపరిచింది.తనపై నల్లగా ఉన్నావనే కామెంట్లు వచ్చాయట.
తనని చాలా ట్రోల్ చేస్తున్నారని, రకరకాలుగా కామెంట్లు చేస్తున్నారని, కర్రగా ఉన్నాడు వీడు హీరో ఏంటి? అసలు వీడు హీరో మెటీరియలే కాదు అంటూ దారుణంగా మాట్లాడుకున్నారట.తాను స్వయంగా తన వెనకాల మాట్లాడుకోవడం విన్నాడట.
అంతేకాదు సోషల్ మీడియాలో చూశానని, ఆర్టికల్స్ చదివానని వెల్లడించారు.

ఈ సందర్భంగా అదిరిపోయే కౌంటర్లు ఇచ్చాడు.కర్రిగా ఉన్నానా?, తెల్లగా ఉన్నానా అనేది మ్యాటర్ కాదని ఇక్కడ టాలెంట్ ముఖ్యం అని చెప్పాడు రోషన్.ఈ సందర్భంగా రోషన్ మాట్లాడుతూ.
నేను చాలా సార్లు విన్నాను.నా వెనకాల మాట్లాడటం చూశాను.
చాలా చదివాను.అరే వీడు హీరో, వీడేంటి మస్త్ కర్రిగా ఉన్నాడు.
వీడు హీరో ఏంటి? హీరో మొఖం కాదు, బొక్క వేస్ట్ హీరో మెటీరియల్ కాదు అన్నారు.నేను ఇలానే పుట్టాను.
ఇలానే ఉంటా.ఒక మనిషికి నలుపు, తెలుపు, అందం కాదు బ్రదర్ సక్సెస్ ని డిసైడ్ చేసేది.
ఆ మనిషి హార్డ్ వర్క్, టాలెంట్, డిసిప్లెయిన్ మాత్రమే నిర్ణయిస్తుంది.మన అందరి జాతకంలో ఏం రాసి పెట్టిందో ఎవరికీ తెలియదు.
కానీ నచ్చినట్టు మార్చుకుంటాము.కావాల్సింది లాక్కొని తెచ్చుకుంటాం.
అది ఇజ్జత్ అయినా, ఔకాద్ అయినా, ఒక రోజు వస్తది, వద్దనుకున్నా వినబడతా చేవులు మూసుకున్నా వినబడతాయి.డిసెంబర్ 29న రాసిపెట్టుకోండి, థియేటర్‌కి వచ్చేయండి.
ఆది గాడి లవ్‌ని చూడండి, ఆదిగాడి ఫైట్ ఫర్ రెస్పెక్ట్ ని చూడండి అని చెప్పుకొచ్చాడు రోషన్ కనకాల.







