మంచినీళ్లు అలా డైరెక్ట్ గా తాగడం కంటే కాచి చల్లార్చిన నీళ్లు తాగడం ఆరోగ్యానికి చాలా మంచింది అని అందరు చెప్తూ ఉంటారు.సీజనల్ వ్యాధులు రాకుండా ఉండాలంటే వేడి నీళ్లు తాగడం ఎంతో మంచిది.
ఇలా కాచి చల్లార్చిన నీళ్లు తాగడం వలన నీటిలో ఉండే సూక్షక్రిములు చనిపోతాయి.అలాగే వేడి నీళ్లు తాగడం వలన చాలా రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి.
అయితే నిజంగా వేడి నీళ్లు తాగడం వల్ల ఉపయోగాలు ఉన్నాయా…? లేదా అనే విషయాలు తెలుసుకుందాం.!!
వేడినీటిని ఒక గిన్నెలోకి తీసుకుని గట్టిగా ఊపిరి పీల్చుకుంటే మంచి రిలీఫ్ ఉంటుంది.
ఇలా చేయడం వల్ల సైనస్ వల్ల కలిగే తలనొప్పి కూడా తగ్గిపోతుంది.అలాగే గొంతు కూడా ఫ్రీ అయిపోతుంది.
వేడి నీళ్లు తాగడం వలన అరుగుదలకి కూడా తోడ్పడుతుంది.కానీ చాలా మంది వేడి నీళ్లు తాగితే అరుగుదల సరిగ్గా అవ్వదు అని పొరపాటు పడుతూ ఉంటారు కానీ అది నిజం కాదు.
వేడి నీళ్లు తాగడం వల్ల తిన్న ఆహారం పూర్తిగా జీర్ణం అవుతుంది.

అలాగే షుగర్, గుండె జబ్బులు, ఉదర సంబంధిత వ్యాధులతో బాధపడే వాళ్లకి వేడి నీళ్ళు తాగడం చాలా మంచిది.అంతేకాకుండా రోగాలను కూడా దరిచేరనివ్వదు.అంతేకాకుండా అధిక బరువు ఉన్నవాళ్లు వేడి నీళ్లు తాగితే ఈ సమస్యను అధిగమించవచ్చు.
అలానే ఈ కాలంలో కీళ్ల నొప్పులతో చాలామంది ఇబ్బందులు పడుతూ ఉంటారు.కీళ్ల నొప్పులతో బాధపడే వారికి వేడి నీళ్లు చాలా సహాయపడతాయి.
జలుబు నుంచి కూడా దూరంగా ఉంచుతుంది.అంటురోగాలు దరి చేరకుండా ఉంటాలంటే వేడి నీళ్లు తాగడం మంచిది.
చిన్న పిల్లలు, గర్భవతి వేడి నీళ్లు తాగడం చాలా మంచిది.