సావిత్రి కన్నా నాకేం తక్కువ.. నాకు అంత డబ్బు కావాలి అంటూ డిమాండ్ చేసిన హీరోయిన్

సినిమాల్లో నటించే హీరో హీరోయిన్స్ కి సాధారణంగానే ఈగో క్లాష్ ఉంటుంది.అది నాటి రోజుల నుంచి నేటి వరకు కొనసాగుతూనే ఉంది.

 Sarojini Devi Demands As Savitri , Jayasudha, Jayaprada, Sridevi, Soundarya, Mee-TeluguStop.com

అయితే సావిత్రి కాలం నుంచి నేటి సమంత కాలం వరకు ఒక్కొక్కరు ఒక్కో హీరోయిన్ తో లేదంటే ఆ జనరేషన్ హీరోయిన్స్ లో కొంత మంది తో ఈగో కి పోయి సినిమాల విషయంలో గొడవలు జరుగుతూనే ఉంటాయి.అలా కొంతమంది హీరోయిన్స్ తమకన్నా అన్ని విషయాల్లో మెరుగ్గా ఉండే హీరోయిన్స్ తో పోటీపడి గొడవలు పడ్డ సందర్భాలు కూడా ఉన్నాయి అలాంటి ఒక సందర్భం గురించి ఇప్పుడు ఈ ఆర్టికల్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

80 దశకంలో జయసుధ, జయప్రద, శ్రీదేవి వంటి హీరోయిన్స్ ఒకరితో ఒకరు సినిమాల విషయంలోనూ రెమినరేషన్ విషయంలో పోటా పోటీపడ్డారు.వారి తర్వాత కాలంలో రాధా, విజయశాంతి లాంటి హీరోయిన్స్ కూడా ఒకరితో ఒకరు పోటీపడి మరి సినిమాల్లో నటించారు.

ఇక మరో తరం విషయానికొస్తే సౌందర్య, మీనా, రోజా, రమ్యకృష్ణ వంటి హీరోయిన్స్ పోటీపడి పదుల సంఖ్యలో ఏకకాలంలో సినిమాల్లో నటించి రెమ్యునరేషన్ కూడా గట్టిగానే తీసుకునేవారు.అయితే సావిత్రి లాంటి హీరోయిన్స్ నటించిన కాలంలో ఆమెతోపాటు కొంతమంది హీరోయిన్స్ ఆమెపై ఈర్ష్యని పెట్టుకునేవారు.

సావిత్రి రెండు కార్లలో షూటింగ్ లోకేషన్ కి వస్తే ఆమెకు ఇచ్చినట్టుగానే రెమ్యూనిరేషన్ ఇవ్వాలని ఆమెకు ప్రొవైడ్ చేసిన అన్ని ఫెసిలిటీస్ కూడా తనకు ప్రొవైడ్ చేయాలని ఆ తరం హీరోయిన్ సరోజా దేవి గట్టిగా పట్టుపట్టారట.

తనకన్నా నేను ఎందులో తక్కువ నాకు ఎందుకు ఇవ్వరు అంటూ నిర్మాతలను డిమాండ్ చేసేదట సరోజినీ దేవి.కానీ నిర్మాతలు మాత్రం నీకు సావిత్రితో పోలిక ఏంటమ్మా ఎవరి క్రేజ్ వారిదే అంటూ మాట దటేసేవారు.సావిత్రికి తెలుగులో ఎంతో పట్టు ఉంటుంది కానీ ఆ విషయంలో సరోజినీ దేవి కాస్త తక్కువనే చెప్పాలి.

ఇక ఆ తర్వాత కాలంలో సరోజినీ దేవి ఎంజీఆర్ తో పిచ్చిపిచ్చిగా ప్రేమలో పడి కెరీర్ ని పోగొట్టుకుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube