టాలీవుడ్ స్టార్ హీరోయిన్లలో ఒకరైన త్రిష వయస్సు ప్రస్తుతం 39 సంవత్సరాలు అనే సంగతి తెలిసిందే.వయస్సు అంతకంతకూ పెరుగుతున్నా త్రిష మాత్రం పెళ్లికి దూరంగా ఉండటంతో అభిమానులు ఒకింత ఫీలవుతున్నారు.
గతంలోనే త్రిష పెళ్లికి సంబంధించి ఎన్నో వార్తలు వైరల్ అయినా ఆ వార్తలు నిజం కాలేదు.అయితే తాజాగా త్రిష పెళ్లి, విడాకుల గురించి మాట్లాడుతూ షాకింగ్ కామెంట్లు చేయగా ఆ కామెంట్లు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.
40 సంవత్సరాల వయస్సు వచ్చిందని ఇంకా ఎప్పుడు పెళ్లి చేసుకుంటావ్ అని అడుగుతున్నారని త్రిష అన్నారు.పెళ్లికి వయస్సుతో లింక్ చేయడం ఏ మాత్రం కరెక్ట్ కాదని ఆమె అభిప్రాయం వ్యక్తం చేశారు.
ప్రస్తుతం చాలామంది చిన్నచిన్న కారణాలకు డివోర్స్ తీసుకుంటున్నారని ఆమె చెప్పుకొచ్చారు.అలా డివోర్స్ తీసుకోవడం నాకు అస్సలు నచ్చడం లేదని త్రిష కామెంట్లు చేయడం గమనార్హం.

పెళ్లి చేసుకుని సంతోషంగా లేకపోవడం కరెక్ట్ కాదని త్రిష చెప్పుకొచ్చారు.నాకు సరైన వ్యక్తి దొరికితే మాత్రమే పెళ్లి చేసుకుంటానని ఆమె చెప్పుకొచ్చారు.పెళ్లిని నేను జీవితాంతం కొనసాగే ప్రయాణంగా భావిస్తానని త్రిష తెలిపారు.పెళ్లి చేసుకోవడం ద్వారా ఆ జర్నీని ఒకేసారి ఉపయోగించుకునే ఛాన్స్ దక్కుతుందని త్రిష అన్నారు.సరైన వ్యక్తి దొరికితే సంతోషంగా ఉంటుందని త్రిష కామెంట్లు చేశారు.త్రిష త్వరలోనే పెళ్లికి సంబంధించిన శుభవార్త చెబుతారేమో చూడాల్సి ఉంది.
కెరీర్ విషయంలో త్రిష ఆచితూచి అడుగులు వేస్తున్నారు.పొన్నియన్ సెల్వన్ సినిమాతో త్రిష సక్సెస్ ను సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే.
త్రిష ఒక్కో సినిమాకు రెండు నుంచి మూడు కోట్ల రూపాయల రేంజ్ లో రెమ్యునరేషన్ తీసుకుంటున్నారు.హీరోయిన్ త్రిషకు క్రేజ్ అంతకంతకూ పెరుగుతుండటం గమనార్హం.
త్రిషను అభిమానించే అభిమానుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది.







